AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ప్రెగ్నెన్సీతో సమంత వర్కవుట్స్.. సొంతంగా చెయ్యొద్దని సలహా.. పోస్ట్ వైరల్..

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్లలో తాను ప్రెగ్నెంట్ అంటూ అసలు విషయం చెప్పింది. ఇక తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంటానని వెల్లడించింది. అయితే తాజాగా తన ఇన్ స్టాలో వర్కవుట్ పోస్టులు షేర్ చేసింది సామ్.

Samantha: ప్రెగ్నెన్సీతో సమంత వర్కవుట్స్.. సొంతంగా చెయ్యొద్దని సలహా.. పోస్ట్ వైరల్..
Samantha
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2026 | 5:09 PM

Share

సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు చాలా మంది మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా బరువైన వస్తువులు మోయడం.. పరుగులు పెట్టడం చేయరు. ఇక ఇప్పుడిప్పుడే కొందరు మహిళలు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చిన్న యోగాసనాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం సులభమైన యోగాసనాలు చేయ్యొ్చ్చని డాక్టర్ చెప్పడంతో తమ శరీరానికి అనుగుణంగా సులభమైన యోగాసనాలు ప్రయత్నిస్తుంటారు. కానీ టాలీవుడ్ హీరోయిన్ సమంత మాత్రం ప్రెగ్నెంట్ సమయంలో హేవీ వర్కవుట్స్ చేస్తుంది. బరువులు ఎత్తేస్తున్న ఫోటోస్ షేర్ చేయడం ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. తాను కడుపుతో ఉన్నప్పటికీ వర్కవుట్స్ చేయడం గురించి ప్రస్తావిస్తూ తాను డాక్టర్ అనుమతి తీసుకున్నానని.. అలాగే తన ట్రైనర్ శిక్షణలోనే తాను ఈ వర్కవుట్స్ చేస్తున్నారని తెలిపింది.

ఎక్కువమంది చదివినవి :  Comedian Sudhakar: ఒక్క సినిమాకు రూ.30 వేల రెమ్యునరేషన్.. ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన నటుడు సుధాకర్..

“ఒక చిన్న గమనిక: నేను చాలా సంవత్సరాలుగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నాను. నా డాక్టర్ అనుమతితో గర్భధారణ సమయంలో కూడా దానిని కొనసాగించాను. నా ట్రైనర్ కూడా ప్రినేటల్ ట్రైనింగ్‌లో సర్టిఫైడ్ అయ్యారు, మీరు ఇక్కడ చూసేవన్నీ నా శరీరం, నా అనుభవం, నా గర్భధారణకు అనుగుణంగా మార్పులు చేస్తున్నాను. ప్రతి గర్భధారణ భిన్నంగా ఉంటుంది, కాబట్టి దయచేసి నా వర్కౌట్‌లను గర్బంతో ఉన్న మహిళలు డాక్టర్ అనుమతి లేకుండా సరైన ట్రైనర్ లేకుండా చేయవద్దు. గర్భధారణ సమయంలో వ్యాయామం చేసే ముందు మీ డాక్టర్‌తో మాట్లాడండి. అర్హత ఉన్న వారి సహాయంతో శిక్షణ తీసుకోండి.” అంటూ రాసుకొచ్చింది.

ఎక్కువమంది చదివినవి :  Eshwar Sai : ఆ టైంలోనే మాధురి నాకు కనెక్ట్ అయ్యింది.. ఆమె చాలా మంచిది.. నోరు విప్పిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి..

దీంతో సామ్ డెడికేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఇదెలా ఉంటే.. చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడు నిర్మాతగాను సక్సెస్ అయ్యింది. అలాగే ఇటీవల డైరెక్టర్ రాజ్ నిడిమోరుని వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లోనే సామ్ తల్లి కాబోతుంది.

ఎక్కువమంది చదివినవి : Chalaki Chanti: వాడు నా పొట్ట కొట్టాడు.. నాకు అవకాశాలు రాకుండా చేశాడు.. చలాకీ చంటి..

సమంత పోస్ట్..

ఎక్కువమంది చదివినవి : Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని..

Follow Us