Anupama Parameswaran : నా పర్సనల్ లైఫ్ గురించి మీకేం తెలుసు..? ఇన్ స్టా పోస్ట్ పై అనుపమ రియాక్షన్..
దక్షిణాది సినీప్రియులకు అత్యంత ఇష్టమైన హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. చాలా కాలంగా సైలెంట్ అయిన ఈ కేరళ కుట్టి.. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో, అటు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. తాజాగా తన కొత్త సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొంది.

అనుపమ పరమేశ్వరన్.. తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్. కొన్నాళ్లుగా సైలెంట్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు తిరిగి అటు సోషల్ మీడియా, ఇటు సినిమాల్లో యాక్టివ్ అయ్యింది. తాజాగా ఆమె నటిస్తూన్న లేటేస్ట్ మూవీ క్రేజీ కళ్యాణం. ఇందులో తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్, వీగే నరేశ్, కిరిటీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. యారో సినిమాస్ బ్యానర్ పై బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి భద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే అడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలోనే ఆగస్ట్ 1న హైదరాబాద్ లో ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. డైరెక్టర్ నందినీ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అనుపమకు వరుస ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఇటీవల ఆమె చేసిన ఇన్ స్టా పోస్ట్ పై ప్రశ్నించగా తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యింది.
ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..
మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా, రిపోర్టర్ అనుపమను ఆమె గతంలో ప్రైవేట్‌గా ఉండేవారని, అయితే గడిచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా విషయాలను బయటపెట్టడం అవసరమా అని ప్రశ్నించారు. ముఖ్యంగా ఆమె అభిమానులతో రీల్స్ ద్వారా కనెక్ట్ అయ్యేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందని రిపోర్టర్ పేర్కొన్నారు.
ఎక్కువమంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‌తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..
ఇందుకు అనుపమ స్పందిస్తూ.. “అది నా సోషల్ మీడియా. నేను ఏమి పోస్ట్ చేయాలో నేను నిర్ణయించుకుంటాను,” అని అన్నారు. తాను దేనినీ బయటపెట్టలేదని, కేవలం ఒక మహిళ పరివర్తన గురించి మాట్లాడుతున్నానని, అలా చేసినందుకు గర్వపడుతున్నానని ఆమె తెలిపారు. రిపోర్టర్ అది అవతలి వారిని నిందించడం కాదా అని అడగగా, అనుపమ, “నా గురించి మీకు ఏమి తెలుసా? నా జీవితం గురించి మీకు ఏమి తెలుసు?” అని ఎదురు ప్రశ్నించారు. ఎవరికీ తెలియదని రిపోర్టర్ ఒప్పుకోవడంతో, అనుపమ “సో, సో పర్వాలేదు. అది మా ఇన్‌స్టాగ్రామ్. మాకు నచ్చినది మేము పోస్ట్ చేస్తాము. అంతే,” అని ముగించారు. ప్రస్తుతం అనుపమ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..
