AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rukmini Vasanth: థియేటర్లలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా.. లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న కాంతార బ్యూటీ..

కాంతార పార్ట్ 1 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో పాపులర్ అయ్యింది హీరోయిన్ రుక్మిణి వసంత్. దీంతో ఈ అమ్మడుకు అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆమె చేతినిండా ప్రాజెక్టులో బిజీగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం రుక్మిణి ఓ గోల్డెన్ ఛాన్స్ మిస్సైనట్లు ప్రచారం నడుస్తుంది.

Rukmini Vasanth: థియేటర్లలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా.. లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న కాంతార బ్యూటీ..
Rukmini Vasanth
Rajitha Chanti
|

Updated on: Oct 06, 2026 | 9:06 AM

Share

థియేటర్లలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా.. లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న కాంతార బ్యూటీ..కన్నడ సినీ వర్గాల్లో ఇప్పుడు ఒక చిన్న సినిమా సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీ హాట్ టాపిక్‌గా మారింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద విడుదలైన ‘ప్రేమద ఊరలి’ (తెలుగులో ‘ప్రేమనే ఊరిలో’) చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. విడుదలైన కేవలం 10 రోజుల్లోనే రూ. 16 కోట్ల వసూళ్లను సాధించి కన్నడ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇటు తెలుగులోనూ ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా ఘన విజయం సాధించిన వేళ, దర్శకుడు మనోజ్ కుమార్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘సప్త సాగరదాచే ఎల్లో’ చిత్రంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా విశేష గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌ను ఈ సినిమాలో నటింపజేయాలని అనుకున్నారట. దర్శకుడు మనోజ్ కుమార్, రుక్మిణి అభినయానికి పెద్ద అభిమాని కావడంతో ఈ చిత్రంలోని ఒక కీలక పాత్ర కోసం ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ సమయంలో రుక్మిణి వసంత్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం, డేట్లు సర్దుబాటు కాకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. తక్కువ బడ్జెట్ సినిమా కావడంతో కాల్ షీట్ల సమస్యలను అధిగమించలేకపోయామని మేకర్స్ తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Babu Mohan: ఆ పాట చూసి చిరంజీవి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను.. బాబూ మోహన్..

రుక్మిణి వసంత్ సినిమాలో నటించలేకపోయినప్పటికీ, ఆమె ప్రభావం మాత్రం ఈ చిత్రంపై బలంగా పడింది. ‘రుక్మిణి వసంత’ అనే పేరు దర్శకుడికి బాగా నచ్చడంతో, కథలోని ఇద్దరు కథానాయికల పాత్రలకు ‘రుక్మిణి’, ‘వసంత’ అని నామకరణం చేశారు. అంతేకాకుండా, ఈ చిత్రానికి మొదట అనుకున్న టైటిల్ కూడా ‘రుక్మిణి వసంత’ కావడ విశేషం. ఆ తర్వాత ఈ టైటిల్‌ను ‘ప్రేమద ఊరలి’గా మార్చారు.

ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..

ఒకవైపు బిజీ షెడ్యూల్ కారణంగా రుక్మిణి ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నప్పటికీ, సినిమా మాత్రం కంటెంట్ బలంతో థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎలాంటి హింస, రక్తపాతం లేకుండా పల్లెటూరి నేపథ్యం, కుటుంబ బంధాలు ,స్వచ్ఛమైన ప్రేమకథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : షాలిని సేఫ్.. సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ.. అన్న కోసం చెల్లెలి ఆర్డర్..

ఎక్కువమంది చదివినవి :  మాయాబజార్ సినిమాలో వాడని పాట.. మనవరాలితో కలిసి అద్భుతంగా పాడిన సింగీతం శ్రీనివాసరావు.. వీడియో ఇదిగో..

Follow Us