AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna- Shiva: 37 ఏళ్లైనా అదే క్రేజ్.. జపాన్‌లో నాగార్జున ‘శివ’ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్.. ఈ వీడియో చూశారా?

37 ఏళ్ల క్రితం విడుదలైన నాగార్జున కల్ట్‌ క్లాసిక్‌ చిత్రం ‘శివ’. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ యాక్షన్ మూవీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఓ మైలు రాయిగా నిలిచింది. ఇప్పుడీ సినిమా జపాన్ లో రిలీజ్ కాగా అక్కడ కూడా నాగార్జున సినిమాకు అద్భుతమైన రెప్పాన్స్ వచ్చింది

Nagarjuna- Shiva: 37 ఏళ్లైనా అదే క్రేజ్.. జపాన్‌లో నాగార్జున 'శివ' సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్.. ఈ వీడియో చూశారా?
37 Years Of Shiva
Basha Shek
|

Updated on: Oct 05, 2026 | 10:42 PM

Share

.అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ మూవీ శివ. 1989లో రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమా రూపు రేఖలను పూర్తిగా మార్చేసింది. దశాబ్దాలు గడుస్తున్నా ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా శివ సినిమా జపాన్ గడ్డపై కూడా తన సత్తా చాటింది. 1989 . అక్టోబర్ 5 న విడుదలైన ‘శివ’ దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో, ఇప్పుడు సరిగ్గా అదే రేంజ్ వైబ్స్ జపాన్ లో కనిపిస్తుంది. ఈ సందర్భంగా అక్కడి ప్రేక్షకులు హీరో నాగార్జునను ప్రేమగా ‘లార్డ్ నాగ్’, ‘నాగ్ సామా’ అని పిలుస్తూ తమ ప్రేమను చాటుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. కాగా శివ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మొదటి సినిమా కావడం గమనార్హం. అయినా తన టేకింగ్ తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సరికొత్త ట్రెండ్ చేశారు ఆర్జీవీ. మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో నాగార్జున నటన నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. ఇందులో హీరోయిన్ గా నాగ్ రియల్ వైఫ్ అక్కినేని అమల ఎంతో అందంగా కనిపించింది. ఇక రఘువరన్ విలనిజం శివ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే తనికెళ్ళ భరణి ఈ సినిమాలో నటించడమే కాకుండా పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా అందించారు.

ఇవి కూడా చదవండి

అక్కినేని నాగార్జున, అక్కినేని వెంకట్,యార్లగడ్డ సురేంద్ర అన్నపూర్ణ స్టూడియోస్ & ఎస్ ఎస్ క్రియేషన్స్ సంయుక్తంగా శివ చిత్రాన్ని నిర్మించారు. ఇళయరాజా సంగీతం అందించారు. కాగా కొన్ని రోజుల క్రితమే శివ సినిమా రీ రిలీజ్ అయ్యింది. సరికొత్త హంగులతో 4K డాల్బీ అట్మాస్ ప్రెజెంటేషన్‌లో శివ సినిమాను మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. అప్పుడు కూడా ఈ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ జపాన్ లోనూ శివ సినిమాకు అద్బుతమైన స్పందన వస్తోంది.

జపాన్ లో అభిమానుల కోలాహలం.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us