AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tilak Varma: అతను అన్న మాటలు గుర్తొచ్చాయి.. అందుకే అంతగా కసిగా చితక్కొట్టా..!

India vs New Zealand 2nd T20I: భారత్-న్యూజిలాండ్ రెండో టీ20లో తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించాడు. చివరి వరకు క్రీజ్‌లో ఉండాలన్న కోచ్ గౌతమ్ గంభీర్ సలహా తనకు స్ఫూర్తినిచ్చిందని తిలక్ వర్మ తెలిపాడు. నితీష్ రెడ్డితో కలిసి మ్యాచ్‌ను ముగించడం ఆనందంగా ఉందని, నమన్ ధీర్ ఆటతీరును ప్రశంసించాడు.

Venkata Chari
|

Updated on: Oct 25, 2026 | 7:41 PM

Share
Tilak Varmas Match-Winning Knock: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓ అద్భుత విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. నితీష్ రెడ్డితో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి, భారత్‌ను విజయం వైపు నడిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక దశలో 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

1 / 5
ఈ క్లిష్ట సమయంలో నమన్ ధీర్, ఆ తర్వాత తిలక్ వర్మ, నితీష్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ గతిని మార్చారు. నమన్ ధీర్ 17 బంతుల్లో 31 పరుగులు చేసి స్కోరు బోర్డును పడిపోకుండా చూసుకున్నాడు. అయితే కీలక సమయంలో అవుటయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మ, నితీష్ రెడ్డి కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పోటాపోటీగా పరుగులు సాధించారు. చివరికి మరో బంతి మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. తిలక్ వర్మ 26 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, నితీష్ రెడ్డి 18 బంతుల్లో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

2 / 5
మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై తిలక్ వర్మ స్పందించాడు. "ఆఖరి వరకు క్రీజ్‌లో ఉండి పోరాడాలని మేము అనుకున్నాం. ఈ విషయాన్ని తమ కోచ్ గౌతమ్ గంభీర్ మ్యాచ్‌కు ముందు నాతో అన్నాడని తిలక్ వర్మ తెలిపాడు. 70కి ఐదు వికెట్లు కోల్పోయాక చివరి వరకు క్రీజ్‌లో ఉండాలని అనుకున్నాం. ఈ మ్యాచ్‌కు ముందు కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే బ్యాటింగ్ కోచ్ నాకు ఒకటే చెప్పారు. ఆఖరి వరకు క్రీజ్‌లో ఉంటే నువ్వు కచ్చితంగా మ్యాచ్ గెలిపిస్తావని నీపైన నమ్మకం ఉందని అన్నారు. ఆ మాటలు నా మదిలో తిరిగాయి. అందుకే మ్యాచ్‌లో చివరి వరకు ఉండి గెలిపించేందుకు నా వంతు కృషి చేశాను" అని తిలక్ వర్మ చెప్పాడు. ఈ విజయం తనకు చాలా గర్వంగా ఉందని పేర్కొన్నాడు.

3 / 5
నమన్ ధీర్ గురించి మాట్లాడుతూ, "నమన్ ధీర్‌కి కూడా నేను ఒకటే చెప్పా, ఏది ఏమైనా మనం చివరి వరకు ఆడాలని. కానీ దురదృష్టవశాత్తు మిచెల్ శాంట్నర్ ఆఖరి ఓవర్లో నమన్ అవుట్ అయ్యాడు. లేకపోతే 18 ఓవర్లలోనే ముగించే వాళ్ళం" అని తిలక్ వర్మ వెల్లడించాడు. అయితే నమన్ ధీర్ అవుట్ అయినా నితీష్ రెడ్డి తనకు చక్కగా సహకరించాడని, అతనితో కలిసి మ్యాచ్‌ను ముగించడం చాలా సంతోషంగా ఉందని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.

4 / 5
ఈ మ్యాచ్‌లో తాను భారీ సిక్సర్లు కొట్టాలని అనుకున్నానని, కానీ పెద్ద మైదానంలో సిక్సర్లు కొట్టాలంటే బంతి వేగం కూడా అవసరం అని తిలక్ వర్మ తెలిపాడు. న్యూజిలాండ్ బౌలర్లు వేగం తగ్గించి బంతులు వేశారని, అందుకే చివరి వరకు పోరాడాల్సి వచ్చిందని వివరించాడు. తిలక్ వర్మ అద్భుతమైన ఆటతీరు, కోచ్ సలహా మేరకు ఆడిన తీరు జట్టు విజయానికి కీలకంగా మారాయి.

5 / 5
Follow Us