AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jailer 2: తన రికార్డులను తానే బ్రేక్ చేస్తున్న రజినీకాంత్

Jailer 2: తన రికార్డులను తానే బ్రేక్ చేస్తున్న రజినీకాంత్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 25, 2026 | 5:36 PM

Share

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ‘జైలర్‌ 2’తో బాక్సాఫీస్‌ వద్ద మరోసారి తన సత్తా చాటుతున్నారని ట్రేడ్‌ వర్గాల అంచనా. ఈ సినిమా ఇప్పటికే రూ.575 కోట్ల మార్క్‌ దాటినట్లు కథనాలు చెబుతున్నాయి. దీంతో రూ.600 కోట్ల వసూళ్లపై ఆసక్తి పెరిగింది. కోలీవుడ్‌లో రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘2.0’ రికార్డును అధిగమించగలదా అన్న చర్చ మొదలైంది. అయితే ఈ వసూళ్ల లెక్కలను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

నన్నిలా కొట్టే దుమ్ము ఎవరికైనా ఉందా.. మళ్లీ నేనే ట్రై చేయనా అంటూ ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ ఓ డైలాగ్ చెప్తారు కదా..? ఇప్పుడు రజినీ దీన్ని మార్చేస్తున్నారు. నాలా రికార్డులు కొట్టే దుమ్మెవరికైనా ఉందా లేదంటే మళ్లీ నేనే ట్రై చేయనా అంటున్నారీయన. జైలర్ 2తోనూ ఈయన దండయాత్ర కొనసాగుతుంది. మంచి నీళ్లు తాగినంత ఈజీగా ఇండస్ట్రీ రికార్డులకు చెక్ పెడుతున్నారు సూపర్ స్టార్. చొక్కా నలగకుండానే మరోసారి 500 కోట్లు కొట్టేసారు రజినీకాంత్. ఈయన స్టామినా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం తగ్గలేదని జైలర్ 2 మరోసారి ప్రూవ్ చేసింది. ఇండియన్ సినిమాలో ప్రభాస్ తర్వాత ఏకంగా నాలుగుసార్లు 500 కోట్ల మార్క్ దాటిన ఏకైక హీరోగా రజినీ రేర్ రికార్డ్ క్రియేట్ చేశారు. కెరీర్‌లో ఇలాంటి అరుదైన ఫీట్ సాధించి తనను కొట్టేవాడే లేదని ఈ వయసులోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. మూడేళ్ళ కింద వచ్చిన జైలర్ సినిమా 600 కోట్ల వసూళ్లు రాబట్టగా.. ఆ తర్వాత వచ్చిన కూలీ 550 కోట్లు కొల్లగొట్టింది. అయితే రజినీ కెరీర్‌లోనే కాదు కోలీవుడ్ హిస్టరీలోనే 2.0 సినిమా 700 కోట్లతో ఇప్పటికీ టాప్ ప్లేస్‌లోనే ఉంది. ఇప్పుడు ఆ ఇండస్ట్రీ హిట్ రికార్డును క్రాస్ చేయడమే సూపర్ స్టార్ ముందున్న అసలైన టార్గెట్. దాన్ని ఈజీగానే అందుకునేలా కనిపిస్తున్నారు ముత్తువేల్ పాండియన్. మొన్న దసరాకు విడుదలైన జైలర్ 2 బాక్సాఫీస్ దగ్గర ఎక్కడా తగ్గకుండా ఇప్పటికే 575 కోట్ల మార్క్ దాటేసి 600 కోట్లకు చేరువైంది. ఈ వారం కూడా థియేటర్లలో ఇదే రేంజ్ దూకుడు కొనసాగేలా కనిపిస్తుండటంతో కలెక్షన్స్ మరింత భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే ఎనిమిదేళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న 2.0 రికార్డులు కనుమరుగవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న బాక్సాఫీస్ ట్రెండ్ చూస్తుంటే ఈ దివాళీలోపే జైలర్ 2 పేరు మీదకి కోలీవుడ్ రికార్డులన్నీ వచ్చేలా ఉన్నాయి. ఇది 1000 కోట్లు కొడుతుందో లేదో తెలియదు కానీ కచ్చితంగా 800 కోట్ల వరకు మాత్రం సూపర్ స్టార్ ప్రయాణం సాగేలా కనిపిస్తుంది. మొత్తానికి తన రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటూ బాక్సాఫీస్ రారాజుగా నిలిచిపోతున్నారు తలైవా.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూపాయి కాయిన్స్‌తో మహిళ నామినేషన్‌.. ఊరంతా తలో రూపాయి చందా

హెయిర్‌ పిన్‌ కోసం దిండుకింద చేయి పెట్టిన యువతి.. చేతికి తగిలింది చూసి షాక్‌!

ఇంటిముందు బెంచ్‌పై కూర్చున్న వ్యక్తులు క్షణాల్లో ఊహించని సీన్‌

వామ్మో.. ఇదేం వింతజీవి.. కోళ్లను వెంటాడుతున్న గ్రహాంతరజీవి?

వ్యాపారవేత్త పెద్దమనసు.. నెటిజన్లు ఫిదా

Follow Us