ఇంటిముందు బెంచ్‌పై కూర్చున్న వ్యక్తులు క్షణాల్లో ఊహించని సీన్
గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో చిరుతపులి కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. గిర్నార్ అడవికి సమీపంలోని ప్రేరణధామ్ ఆశ్రమం వెలుపల అక్టోబర్ 16న సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. బెంచ్‌పై కొందరు వ్యక్తులు కూర్చొని ఉండగానే చిరుత వేగంగా వచ్చి కుక్కపిల్లను నోట కరుచుకుని అడవిలోకి పారిపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డవడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అందరూ చూస్తుండగానే ఓ చిరుత అత్యంత చాకచక్యంగా కుక్కను వేటాడి నోటకరుచుకుని అడవిలోకి పారిపోయింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వివరాల ప్రకారం… అక్టోబర్ 16న సాయంత్రం 7:30 గంటల సమయంలో గిర్నార్ అడవికి సమీపంలో ఉన్న ‘ప్రేరణధామ్’ ఆశ్రమం వెలుపల కొందరు వ్యక్తులు బెంచ్‌పై కూర్చొని ఉన్నారు. వారంతా తమ చేతుల్లోని మొబైల్ ఫోన్లు చూసుకుంటూ ఉన్నారు. మరికొందరు వ్యక్తులు కూడా అక్కడే నిలబడి మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఆశ్రమం ప్రవేశద్వారం వద్ద ఉన్న ఆఫీస్ సమీపంలోకి ఒక చిన్న కుక్క పిల్ల వచ్చింది. అది బెంచ్‌పై కూర్చున్న వారి పక్కనుంచి ఆపీసు రూమ్‌లోకి వెళ్తోంది. ఇంతలో పక్కనే ఉన్న అటవీప్రాంతంనుంచి ఒక చిరుతపులి మెరుపు వేగంతో దూసుకొచ్చి కుక్కపిల్లను నోటకరచుకొని పారిపోయింది. కళ్ల ముందే మనుషులు ఉన్నారనే భయం కూడా లేకుండా, బెంచ్‌కు అతి సమీపంలో ఉన్న కుక్క పిల్లను ఒక్కసారిగా నోటకరుచుకుని క్షణాల్లో అడవిలోకి పారిపోయింది. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ఏం జరిగిందో కూడా అర్థం కాక బెంచ్‌పై ఉన్న వ్యక్తులు గందరగోళానికి గురయ్యారు. ఆ తర్వాత అనుమానం వచ్చి ఆశ్రమ నివాసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. కుక్కపై చిరుత దాడి చేసి ఎత్తుకెళ్లిన దృశ్యాలు కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. ఆశ్రమానికి అతిసమీపంలోకి చిరుత వచ్చి వెళ్లడంతో స్థానికులు, ఆశ్రమవాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. ఇదేం వింతజీవి.. కోళ్లను వెంటాడుతున్న గ్రహాంతరజీవి?
వ్యాపారవేత్త పెద్దమనసు.. నెటిజన్లు ఫిదా
దీపావళి వేళ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. మీ జీతం ఎంత పెరుగుతుందో తెలుసా?
ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. చివరికి జైలుపాలయ్యారు.. కారణం తెలుసా!
ఇంటిముందు బెంచ్‌పై కూర్చున్న వ్యక్తులు క్షణాల్లో ఊహించని సీన్
వామ్మో.. ఇదేం వింతజీవి.. కోళ్లను వెంటాడుతున్న గ్రహాంతరజీవి?
వ్యాపారవేత్త పెద్దమనసు.. నెటిజన్లు ఫిదా
దీపావళి వేళ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. చివరికి..
అయ్యో.. భర్త హగ్ చేసుకోగానే కుప్పకూలిన మహిళ
కేదార్‌నాథ్‌లో మంచు వర్షం.. సెల్ఫీలతో యాత్రికుల సందడి

