AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఇదేం వింతజీవి.. కోళ్లను వెంటాడుతున్న గ్రహాంతరజీవి?

వామ్మో.. ఇదేం వింతజీవి.. కోళ్లను వెంటాడుతున్న గ్రహాంతరజీవి?

Phani CH
|

Updated on: Oct 25, 2026 | 5:02 PM

Share

అమెరికా–మెక్సికో సరిహద్దు సమీపంలో వింత జీవి కనిపించిందన్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. జైమ్‌ మౌస్సాన్‌ బృందం విడుదల చేసిన సీసీటీవీ చిత్రాల్లోని ఆకారం ‘స్ట్రేంజర్‌ థింగ్స్‌’ డెమోగోర్గాన్‌ను పోలి ఉందని చెబుతున్నారు. అయితే, ఆ జీవి ఏమిటన్నది నిర్ధారణ కాలేదు. స్థానిక అధికారులు కూడా దీనిపై అధికారిక నివేదికలు అందలేదని తెలిపారు. మౌస్సాన్‌ గతంలో చేసిన వివాదాస్పద ప్రకటనల నేపథ్యంలో తాజా వాదనలపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా-మెక్సికో సరిహద్దు సమీపంలో ఓ వింత జీవి సంచరిస్తోందన్న వార్త కలకలం రేపుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోని ‘స్ట్రేంజర్ థింగ్స్’ వెబ్ సిరీస్‌లో కనిపించే ‘డెమోగోర్గాన్’ అనే జీవిని పోలి ఉండటంతో ఈ విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. యూఎఫ్‌ఓలపై పరిశోధనలు చేసే జైమ్ మౌస్సాన్ బృందం విడుదల చేసిన సీసీ కెమెరా చిత్రాల్లో ఈ జీవి కనిపించింది. మెక్సికోలోని రియో గ్రాండే నది వెంబడి ఉన్న జుయారెజ్ లోయలో అక్టోబర్ 17న కొన్ని సర్వైలెన్స్ కెమెరాల్లో ఈ వింత జీవి దృశ్యాలు రికార్డ్ అయినట్లు మౌసన్ తెలిపారు. పాలిపోయిన రంగులో, పొడవాటి కాళ్లు, సుమారు మూడు అడుగుల పొడవైన తోకతో ఉన్న ఈ జంతువు మొత్తంగా ఆరు అడుగుల పొడవు ఉంటుందని ఆయన బృందం అంచనా వేసింది. ఇది చాలా చురుకైనదని, తెలివైనదని, చూడటానికి కాస్త మనిషిని పోలి ఉందని వారు విశ్లేషిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కోళ్లు, కుందేళ్లు వంటి చిన్న జంతువులపై ఇది దాడి చేసి చంపుతోందని మౌసన్ ఆరోపించారు. ఇది గ్రహాంతరవాసి కాకుండా, మరో లోకం నుంచి వచ్చిన జీవి అయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఈ వాదనలను అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. ఈ వింత జీవి గురించి గానీ, జంతువులు చనిపోయినట్లు గానీ తమకు ఎలాంటి నివేదికలు అందలేదని జుయారెజ్ సివిల్ ప్రొటెక్షన్ అధికారులు స్పష్టం చేశారు. అటు అమెరికా వైపు టెక్సాస్ పోలీసులు కూడా అసాధారణ సంఘటనలేవీ తమ దృష్టికి రాలేదని తెలిపారు. లభించిన ఫుటేజ్‌లో ఆ జీవి రెండు కాళ్లపై నిటారుగా నడుస్తున్నట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదు. కాగా, జైమే మౌసన్ గతంలోనూ ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేసి వార్తల్లో నిలిచారు. 2023లో ఆయన మెక్సికో పార్లమెంట్‌కు సమర్పించిన రెండు ‘మానవేతర మమ్మీలు’.. మానవ, జంతువుల ఎముకలతో తయారు చేసిన నకిలీవని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. అంతకుముందు ఆయన చూపిన మరో గ్రహాంతరవాసి ఆకారం, మార్పులు చేసిన ఒక స్క్విరెల్ మంకీ అని తేలింది. ఈ నేపథ్యంలో తాజా ఆరోపణలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వ్యాపారవేత్త పెద్దమనసు.. నెటిజన్లు ఫిదా

దీపావళి వేళ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. మీ జీతం ఎంత పెరుగుతుందో తెలుసా?

ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. చివరికి జైలుపాలయ్యారు.. కారణం తెలుసా!

రూట్ మార్చిన జహీరాబాద్ రైతులు.. ఆలు సాగుకు గుడ్‌బై!

ఎల్ నినో ఎఫెక్ట్.. తెలంగాణలో మొదలైన రైతుల కష్టాలు

Follow Us