AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెయిర్‌ పిన్‌ కోసం దిండుకింద చేయి పెట్టిన యువతి.. చేతికి తగిలింది చూసి షాక్‌!

హెయిర్‌ పిన్‌ కోసం దిండుకింద చేయి పెట్టిన యువతి.. చేతికి తగిలింది చూసి షాక్‌!

Phani CH
|

Updated on: Oct 25, 2026 | 5:27 PM

Share

బెంగళూరులోని బాగలగుంటె, భైరవేశ్వరనగర్‌లో ఓ ఇంట్లో దిండు కింద నాగుపాము కనిపించడం కలకలం రేపింది. రాత్రంతా గదిలో నిద్రించిన తోబుట్టువులకు పాము ఉన్న విషయం తెలియలేదు. ఉదయం హెయిర్‌పిన్‌ కోసం దిండు కింద చేయి పెట్టిన యువతికి పాము కనిపించడంతో భయంతో బయటకు పరుగెత్తింది. సమాచారం అందుకున్న స్నేక్‌ క్యాచర్‌ నాగేంద్ర పామును పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సీన్‌ చూస్తే ఎవరికైనా గుండె ఆగినంత పని అవుతుంది. సాధారణంగా పాములు బయట కనిపిస్తేనే భయంతో పరుగులు తీస్తాం. అలాంటిది ఇంట్లో.. అదికూడా మనం నిద్రపోతున్న దిండుకింద పాము తిష్టవేసుకొని కనిపిస్తే పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి.. సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది బెంగళూరులో. ఓ ఇంట్లో తోబుట్టువులు హాయిగా నిద్రిస్తుండగా, వారికి తెలియకుండానే ఒక ప్రమాదకరమైన నాగుపాము వచ్చి వారి పక్కనే చేరింది. రాత్రంతా ఆ పాముతో పాటే నిద్రించిన ఆ యువతీయువకులు ఉదయాన్నే దాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. బెంగళూరులోని బాగలగుంటె, బైరవేశ్వరనగర్‌కు చెందిన రూప అనే మహిళ ఇంట్లో ఈ ఘటన జరిగింది. రాత్రి సమయంలో రూప ఇద్దరు పిల్లలు తమ గదిలో నిద్రపోతున్నారు. ఆ సమయంలో కిటికీ గుండా ఒక పెద్ద నాగుపాము గదిలోకి ప్రవేశించింది. రాత్రంతా ఆ పాము గదిలో అటు ఇటు తిరుగుతున్నప్పటికీ నిద్రలో ఉన్న ఆ పిల్లలకు దాని ఉనికి అసలు తెలియలేదు. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఆ యువతి తన జుట్టుకు పెట్టుకునే హెయిర్‌పిన్ కోసం వెతుకుతూ తలగడ కింద చెయ్యి పెట్టగా.. చేతికి ఏదో కదులుతున్నట్టు తగిలింది. ఏంటా అని చూసే సరికి అక్కడ దాక్కుని ఉన్న నాగుపాము కనిపించడంతో ఆమె ఒక్కసారిగా కేకలు వేస్తూ తన సోదరుడితో కలిసి బయటకు పరుగులు తీసింది. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ‘స్నేక్’ నాగేంద్రకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న నాగేంద్ర, దిండు కింద ఉన్న నాగుపామును ఎంతో చాకచక్యంగా పట్టుకుని, సురక్షితంగా సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. రాత్రంతా విషసర్పం పక్కనే నిద్రపోయినా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు, స్థానికులు అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటిముందు బెంచ్‌పై కూర్చున్న వ్యక్తులు క్షణాల్లో ఊహించని సీన్‌

వామ్మో.. ఇదేం వింతజీవి.. కోళ్లను వెంటాడుతున్న గ్రహాంతరజీవి?

వ్యాపారవేత్త పెద్దమనసు.. నెటిజన్లు ఫిదా

దీపావళి వేళ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. మీ జీతం ఎంత పెరుగుతుందో తెలుసా?

ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. చివరికి జైలుపాలయ్యారు.. కారణం తెలుసా!

Follow Us