AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూపాయి కాయిన్స్‌తో మహిళ నామినేషన్‌.. ఊరంతా తలో రూపాయి చందా

రూపాయి కాయిన్స్‌తో మహిళ నామినేషన్‌.. ఊరంతా తలో రూపాయి చందా

Raju M P R
| Edited By: |

Updated on: Oct 25, 2026 | 5:42 PM

Share

తిరుపతి జిల్లా చిగురువాడలో సుభద్రమ్మ వినూత్నంగా జడ్పీటీసీ నామినేషన్‌ దాఖలు చేశారు. గ్రామస్తులంతా తలో రూపాయి చొప్పున ఇచ్చిన 6 వేల నాణేలను డిపాజిట్‌ కోసం తీసుకెళ్లారు. గ్రామంలో మౌలిక వసతుల సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఊరి సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గ్రామస్తులు ఈ విధంగా మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు.

ఏపీ స్థానిక ఎన్నికల వేళ చిత్ర విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తిరుపతి జిల్లాలో జరిగిన ఓ వినూత్న ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. చిగురువాడ గ్రామానికి చెందిన సుభద్రమ్మ.. రూపాయి నాణేలతో నామినేషన్‌ దాఖలు చేసి వార్తల్లో నిలిచారు. గ్రామస్తులంతా తలో రూపాయి చొప్పున చందా ఇవ్వడంతో.. మొత్తం 6 వేల రూపాయి నాణేలను సేకరించి ఆమె ఎన్నికల బరిలోకి దిగారు. తమ గ్రామ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదనతో.. గ్రామస్తులు ఈ వినూత్న నిరసనకు దిగారు. తిరుపతి రూరల్‌ మండలం చిగురువాడ గ్రామానికి చెందిన సుభద్రమ్మ.. జడ్పీటీసీ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. అయితే, ఆమె నామినేషన్‌ దాఖలు చేయడానికి వెళ్లిన తీరు ప్రత్యేకంగా నిలిచింది. సాధారణంగా అభ్యర్థులు నామినేషన్‌ డిపాజిట్‌ను నోట్ల రూపంలో చెల్లిస్తుంటారు. కానీ, సుభద్రమ్మ మాత్రం 6 వేల రూపాయి నాణేలను తీసుకుని వెళ్లారు. ఆ నాణేలను చూసిన అధికారులు వివరాలు అడగడంతో.. గ్రామస్తులంతా తలో రూపాయి చొప్పున చందా ఇచ్చారని, ఆ డబ్బుతోనే నామినేషన్ వేయడానికి వచ్చానంటూ ఆమె చెప్పారు. తమ గ్రామంలో మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సరైన శ్రద్ధ చూపడం లేదని సుభద్రమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగే నాయకులు.. ఆ తర్వాత గ్రామ సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ ఊరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే తలో రూపాయి చొప్పున విరాళం ఇచ్చి సుభద్రమ్మను ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రోత్సహించినట్లు తెలిపారు. గ్రామస్తుల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు సుభద్రమ్మ వెల్లడించారు. అయితే, తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కొందరు స్వతంత్ర అభ్యర్థులు రూపాయి, రెండు రూపాయల నాణేలను గోనె సంచుల్లో తీసుకొచ్చి నామినేషన్‌ డిపాజిట్‌ చెల్లించేందుకు ప్రయత్నించారు. పెద్ద మొత్తంలో చిల్లర నాణేలు తీసుకురావడంతో అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. అప్పట్లో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు చిగురువాడలో సుభద్రమ్మ రూపాయి నాణేలతో నామినేషన్‌ దాఖలు చేయడం మరోసారి చర్చకు దారితీసింది. సాధారణంగా రూపాయి విలువ చిన్నదిగా కనిపించవచ్చు. కానీ, గ్రామస్తులంతా కలిసి తలో రూపాయి ఇవ్వడం వెనుక తమ సమస్యలపై ఉన్న ఆవేదన, ఐక్యత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రమే కాకుండా.. తమ గ్రామ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంగా ఈ ఘటనను చూడొచ్చు. మరి సుభద్రమ్మకు గ్రామస్తుల మద్దతు ఎన్నికల్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఆమె పోటీతోనైనా చిగురువాడ సమస్యలు పరిష్కారమవుతాయా? అనేది వేచి చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హెయిర్‌ పిన్‌ కోసం దిండుకింద చేయి పెట్టిన యువతి.. చేతికి తగిలింది చూసి షాక్‌!

ఇంటిముందు బెంచ్‌పై కూర్చున్న వ్యక్తులు క్షణాల్లో ఊహించని సీన్‌

వామ్మో.. ఇదేం వింతజీవి.. కోళ్లను వెంటాడుతున్న గ్రహాంతరజీవి?

వ్యాపారవేత్త పెద్దమనసు.. నెటిజన్లు ఫిదా

దీపావళి వేళ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. మీ జీతం ఎంత పెరుగుతుందో తెలుసా?

Published on: Oct 25, 2026 05:29 PM
Follow Us