AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేం ఊరమాస్ అంటున్న హీరోయిన్స్

మేం ఊరమాస్ అంటున్న హీరోయిన్స్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 25, 2026 | 5:35 PM

Share

సౌత్‌ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్లు రొటీన్‌ గ్లామర్‌ పాత్రలకు భిన్నంగా పవర్‌ఫుల్‌ యాక్షన్‌ రోల్స్‌ ఎంచుకుంటున్నారు. కీర్తి సురేష్‌ ‘అక్క’ వెబ్‌ సిరీస్‌లో మాస్‌ అవతారంలో కనిపించగా, రష్మిక మందన్న ‘మైసా’తో రఫ్‌ అండ్‌ రస్టిక్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. నయనతార ‘రెక్కయ్‌’లో యాక్షన్‌ పాత్రలో కనిపించనుండగా, సమంత ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’, ‘సిటాడెల్‌’ తర్వాత ‘మా ఇంటి బంగారం’తోనూ తన యాక్షన్‌ ఇమేజ్‌ను కొనసాగిస్తున్నారు.

ఇండస్ట్రీతో సంబంధం లేదు.. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్స్ అంతా రొటీన్ గ్లామర్ పాత్రలకి గుడ్ బై చెప్పేసి ఊరమాస్ ఇమేజ్ వైపు అడుగులేస్తున్నారు. ఇన్నాళ్లూ హీరోలకే పరిమితమైన రస్టిక్ క్యారెక్టర్స్‌ని ఎంచుకుంటూ తమలోని అసలైన యాక్షన్ యాంగిల్ బయటికి తీస్తున్నారు. వెబ్ సిరీస్ నుంచి వెండితెర వరకు ఎక్కడ చూసినా ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. మరి వాళ్లెవరో చూద్దామా..? నెట్ ఫ్లిక్స్ కోసం కీర్తి సురేష్ చేస్తున్న అక్క వెబ్ సిరీస్ ట్రైలర్‌లో తనలోని పవర్ ఫుల్ మాస్ యాంగిల్ బయటికి తీసారు. గ్లామర్‌తో పాటు నెక్స్ట్ లెవెల్ యాక్షన్‌తో డిజైన్ చేసిన ఈ క్యారెక్టర్‌లో రాధికా ఆప్టేతో కీర్తి ఫేస్ ఆఫ్ సీన్స్ అదిరిపోయాయి. మరోవైపు నేషనల్ క్రష్ రష్మిక సైతం మైసా సినిమాలో చాలా రఫ్ అండ్ రస్టిక్‌గా కనిపిస్తూ టీజర్‌తోనే సినిమా ఎలా ఉండబోతోందో ఒక క్లారిటీ ఇచ్చేసారు. నయనతార సైతం రెక్కయ్ సినిమాతో ఊర మాస్ అవతారం ఎత్తి బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేయడానికి రెడీ అయ్యారు. చేతిలో బైసా పట్టుకుని శత్రువులతో యుద్ధం చేయడానికి సిద్ధమైన ఆమెను చూస్తుంటేనే మాస్ అర్థమవుతుంది. గ్లామర్‌కు స్కోప్ లేకుండా కంప్లీట్ మాస్ వైబ్స్‌తో నయన్ చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ప్రేక్షకులకు కిక్ ఇస్తుందో లేదో మరి..? సమంత అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ నుంచే తన రూట్ పూర్తిగా మార్చుకున్నారు. అందులో యాక్షన్ వైబ్స్ మామూలుగా ఉండవు. తర్వాత సిటాడెల్‌ సిరీస్‌తో పాటు మా ఇంటి బంగారం సినిమాలో కూడా అదే పవర్ రిపీట్ చేసారు. మొత్తానికి ఒకప్పుడు క్యూట్‌గా కనిపించిన ఈ స్టార్ హీరోయిన్స్ అంతా ఇప్పుడు సరికొత్తగా ఊర మాస్ యాక్షన్‌తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూపాయి కాయిన్స్‌తో మహిళ నామినేషన్‌.. ఊరంతా తలో రూపాయి చందా

హెయిర్‌ పిన్‌ కోసం దిండుకింద చేయి పెట్టిన యువతి.. చేతికి తగిలింది చూసి షాక్‌!

ఇంటిముందు బెంచ్‌పై కూర్చున్న వ్యక్తులు క్షణాల్లో ఊహించని సీన్‌

వామ్మో.. ఇదేం వింతజీవి.. కోళ్లను వెంటాడుతున్న గ్రహాంతరజీవి?

వ్యాపారవేత్త పెద్దమనసు.. నెటిజన్లు ఫిదా

Follow Us