కాంతార బ్యూటీకి లక్కీ ఛాన్స్.. మెగా హీరో సరసన సప్తమి గౌడ..

Rajitha Chanti

Pic credit - Instagram

25 October 2026

టాలీవుడ్ మెగా సుప్రీం హీరో సాయిదుర్గా తేజ్ విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తున్నారు.

దర్శకుడు తేజ కాకుమాను దర్శకత్వంలో సాయిదుర్గా తేజ్ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ భారీ ప్రాజెక్ట్‌లో సాయిదుర్గా తేజ్ సరసన కథానాయికగా నటించేందుకు కన్నడ బ్యూటీ, 'కాంతార' ఫేమ్ సప్తమి గౌడను ఎంపిక చేసినట్లు సమాచారం.

'కాంతార' చిత్రంతో పాన్-ఇండియా స్థాయిలో విశేష గుర్తింపు సాధించిన సప్తమి గౌడ, ఆ తర్వాత బాలీవుడ్‌లో 'ది వ్యాక్సిన్ వార్' చిత్రంలోనూ నటించింది.

విద్యార్థి దశలోనే జాతీయ స్థాయి స్విమ్మర్‌గా రాణించి పతకాలు సాధించిన ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, నటనపై మక్కువతో సినీ రంగంలోకి వచ్చి తన ప్రతిభను చాటుకుంది.

ఇప్పుడు టాలీవుడ్‌లో మెగా హీరో పక్కన ఈ లక్కీ ఛాన్స్ దక్కించుకోవడం ఆమె కెరీర్‌కు మరో పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారనుంది.

ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో అద్భుతమైన కథాంశంతో పాటు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్.. పూర్తిగా హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. 

సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తవుతుండగా, ఈ నెలాఖరులోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.