తెలుగులో కనిపించకుండాపోయిన ప్రేమమ్ బ్యూటీ 

25 October 2026

Rajeev 

మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మడోనా సెబాస్టియన్.. నాగచైతన్య హీరోగా నటించిన తెలుగు ‘ప్రేమమ్’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’లో మడోనా కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో లాయర్‌గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

రెండు తెలుగు సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీకి ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వరుస అవకాశాలు రాలేదనే చర్చ సినీ వర్గాల్లో ఉంది. 

మడోనా కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. తమిళం, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది.

తమిళ స్టార్ విజయ్ నటించిన ‘లియో’ సినిమాలో మడోనా కీలక పాత్రలో కనిపించింది. ఈ చిత్రంతో ఇతర భాషల ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరైంది.

2025లో విడుదలైన ‘డ్రైవ్’ సినిమాలోనూ మడోనా నటించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు అంతగా రావడం లేదు. 

మడోనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ.