అందం ఫుల్లు.. అవకాశాలు నిల్లు..! గత్తరలేపుతున్న దివ్య భారతి

1 August   2026

Pic credit - Instagram

Rajeev 

మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది అందాల తార దివ్య భారతి. 

ఆమె 2015లో మిస్ ఎథ్నిక్ ఫేస్ ఆఫ్ మద్రాస్, 2016లో న్యూ ఫేస్ మోడల్, క్రౌన్డ్ ప్రిన్సెస్ సహా ఎన్నో టైటిల్స్ సొంతం చేసుకుంది.

2021లో బ్యాచిలర్‌ చిత్రంతో అరంగేట్రం చేసిన ఆమె ఏక కాలంలో తమిళ, తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

బ్యాచిలర్‌ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది . దాంతో కుర్రాళ్లు ఈ బ్యూటీకి ఫిదా అయ్యారు. బ్యాచిలర్‌ సాధించడంతో మరిన్ని అవకాశాలను రాబట్టుకుంది.

అంజనా అలీఖాన్‌ దర్శకత్వంలో ముగెన్‌ సరసన ప్రేమకథా చిత్రం మదిల్‌మేల్‌ కాదల్‌ చిత్రంలో నటించింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది.

తర్వాత కింగ్ స్టన్  సినిమా చేసింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత సైలెంట్ అయ్యింది దివ్యభారతి.

ప్రస్తుతం సుడిగాలి సుధీర్ సరసన G.O.A.T (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రంలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో తన అందంతో కవ్విస్తుంది.