Actress Prema : బాబోయ్.. ఆ హీరోతో సినిమా చేయడం చాలా కష్టం.. ఆ సీన్ లో చచ్చిపోతా అనుకున్నా.. హీరోయిన్ ప్రేమ..
సీనియర్ నటి ప్రేమ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా రియల్ స్టార్ దర్శకత్వంలో వచ్చిన ఐకానిక్ సినిమ లో పనిచేసిన అనుభవాన్ని ఆమె ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. అంతేకాదు.. తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

2000వ దశకంలో దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ ప్రేమ. కన్నడ తెలుగు భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యలో తన పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి వెల్లడించింది. ముఖ్యంగా కన్నడ హీరో ఉపేంద్రతో సినిమాలు చేయడం గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఉపేంద్ర సినిమాలో తనకు లభించిన పాత్ర ఎంతో కష్టమైనదని, ఎంతో వైవిధ్యమైనదని ప్రేమ తెలిపారు. ఆ సినిమాలో రవీనా టాండన్, దామినిలతో పాటు తాను ప్రధాన పాత్ర పోషించానని, తన రోల్ ఎంతో విభిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. కేవలం 16-18 ఏళ్ల వయసులోనే అంతటి పవర్ ఫుల్ , ఎమోషనల్ క్యారెక్టర్‌ను పోషించడం నిజంగా పెద్ద చాలెంజ్ అని ఆమె వెల్లడించారు.
దర్శకుడిగా ఉపేంద్ర సెట్స్‌లో ప్రతి సన్నివేశం అత్యంత సహజంగా రావాలని కోరుకునేవారని ప్రేమ చెప్పారు. నిజమైన గాజు పెంకులు, నిప్పుల మధ్య చిత్రీకరించిన సీన్ల సమయం లో ఎలాంటి నకిలీ డూప్‌లు లేకుండా రియలిస్టిక్ షాట్స్ కోసం ఆయన తీవ్రంగా శ్రమించేవారని గుర్తుచేశారు. ఈ క్రమంలో కథానాయిక రవీనా టాండన్‌కు, ఉపేంద్రకు మధ్య సన్నివేశాల తీవ్రత కారణంగా చిన్నపాటి వాగ్వాదాలు కూడా జరుగుతుండేవని సరదాగా పంచుకున్నారు.
ఆ సినిమా షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లు, కష్టమైన సీన్లు తనను నటిగా మరింత దృఢంగా మార్చాయని ప్రేమ పేర్కొన్నారు. ఉపేంద్ర ప్రతిభను, ఆయన విజన్‌ను కొనియాడిన ఆమె, ఆయన అద్భుతమైన నటుడే కాకుండా వినూత్నమైన ఆలోచనలు కలిగిన గ్రేట్ డైరెక్టర్ అని ప్రశంసించారు. దీనితో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కలసి నటించిన ‘రాయలసీమ రామన్న చౌదరి’ చిత్రం జ్ఞాపకాలను, ఆయన డిసిప్లిన్ , బాడీ లాంగ్వేజ్ గురించి కూడా ప్రేమ వెల్లడించారు.
ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..
ఎక్కువమంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‌తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..
