Kaaka: భలే మాయ చేసిన మెగాస్టార్.. ఏంటి కాకా ఇది.. ?
మెగా 158కు చిరంజీవి కొత్త సినిమా టైటిల్‌గా ‘కాకా’ను ప్రకటించారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మూడు నిమిషాల టీజర్‌ను విడుదల చేశారు. ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించిన చిరు.. చివర్లో మాఫియా బ్యాక్‌డ్రాప్‌కు సంబంధించిన సాలిడ్ హింట్ ఇచ్చారు. తండ్రి, కూతురు సెంటిమెంట్ కూడా కథలో కీలకంగా ఉండనుంది. అనస్వర రాజన్ చిరంజీవి కూతురిగా నటిస్తున్నారు. సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
మనం ముందు నుంచి చెప్పుకుంటున్నదే.. చిరంజీవి కావాలనే ఆరోజు అందర్నీ ఆటపట్టించారు. తన సినిమా టైటిల్ సగం చెప్పి వదిలేసారు. మెగా 158ను చిరు లీక్స్ పేరుతో 10 రోజులుగా ట్రెండ్ అయ్యేలా థమన్‌తో కలిసి ప్లాన్ చేసారు మెగాస్టార్. ఇప్పుడవన్నీ తూచ్ కాకా అనేసారు.. మరి మెగాస్టార్ కొత్త టైటిల్‌పై వస్తున్న రియాక్షన్స్ ఏంటి.. టీజర్ ఎలా ఉంది..? పది రోజుల కింద కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్‌లో కదిరి అంటూ తన సినిమాపై ట్రెండ్ మొదలయ్యేలా చేసారు చిరంజీవి. అప్పటి వరకు చిరు లీక్స్ అంటే అనుకోకుండానే జరిగేవి.. కానీ ఆరోజు మాత్రం అనుకుని మరీ చేసారు మెగాస్టార్. తాజాగా విడుదలైన టైటిల్‌లో కదిరి లేదు.. కాకా మాత్రమే ఉంది. మెగా 158కు కాకా అనే మాస్ టైటిల్ పెట్టారు బాబీ. ఒకటి రెండు కాదు.. ఏకంగా 3 నిమిషాల టీజర్ ఇచ్చారు మేకర్స్. ఇందులో చాలా క్లాస్‌గా కనిపిస్తూ ఫ్యామిలీ మ్యాన్ అవతార్‌లో ఉన్నారు చిరంజీవి. కానీ టీజర్ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది.. గన్స్‌తో మాఫియా బ్యాక్‌డ్రాప్ అంటూ హింటిచ్చారు. అంతేకాదు కాకా వెనక బాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని కూడా అర్థమైపోయింది. టీజర్ మొత్తానికి మేజర్ హైలైట్ గ్యాంగ్ లీడర్‌లోని చికి చికి చేలం పాట రీమిక్స్.. గతేడాది మన శంకరవరప్రసాద్ గారు కోసం రౌడీ అల్లుడు మ్యూజిక్ రీమిక్స్ చేస్తే ఈసారి గ్యాంగ్ లీడర్ తీసుకున్నారు. కాకా కేవలం మాఫియానే కాదు అదిరిపోయే ఫాదర్ సెంటిమెంట్ సినిమా కూడా. ఇందులో చిరు కూతురుగా అనస్వర రాజన్ నటిస్తున్నారు.. టీజర్‌లోనూ ఐ లవ్ మై డాడ్ అనే హైలైట్ చేసారు. సంక్రాంతి టార్గెట్‌గా జనవరి 13న సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే సంక్రాంతి పోరు మామూలుగా లేదు. జనవరి 12న సంబరాల ఏటిగట్టు, అనిల్ రావిపూడి సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక జనవరి 14 ఆల్రెడీ తాను వస్తున్నట్లు చెప్పారు శర్వానంద్. తాజాగా కాకా జనవరి 13న లాక్ అయిపోయింది. మరి ఈ పోరు ఎలా ఉండబోతుందో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price: పసిడి పరుగులు.. ఇవాళ తులం బంగారం ధర ఇదే!
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
ఎయిర్‌హోస్టెస్ నుంచి పోలీస్ ఆఫీసర్‌గా వచ్చింది.. అవినీతి ఊబిలో చిక్కుకొని..
2026 Lunar Eclipse: ఆగస్టు 28న ఆకాశంలో అద్భుతం.. భారత్‌లో కనిపిస్తుందా?
గంటల తరబడి మొబైల్ చూస్తున్నారా? మీ వెన్నెముకకు ముప్పు తప్పదు!
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

