విజయనగరం జిల్లా గాజులరేగ కొండ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ రమణ ప్రాణాలు కోల్పోయారు. ఒక కేసు దర్యాప్తు కోసం వెళ్తుండగా వాహనం బోల్తాపడటంతో ఎస్ఐ అశోక్‌తో పాటు పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఎస్పీ దామోదర్, మంత్రి కొండపల్లి స్పందించారు.