ఆ దర్శకుడి దగ్గర ఫ్యాన్లు మోశా.. ఆయనను చూసే సినిమా తీయడం నేర్చుకున్నా: శివ నిర్వాణ
కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న మాస్ మహారాజా రవితేజకు ఇరుముడి రూపంలో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. గత శుక్రవారం (ఆగస్టు 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టుతోంది.

ఇరుముడి సినిమాతో దర్శకుడు శివ నిర్వాణ భారీ విజయాన్ని అందుకున్నాడు. విభిన్నమైన కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు ఈ టాలెంటెడ్ దర్శకుడు. తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న సమస్యలను, తన అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. లెజెండరీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆయనకున్న అనుబంధం, ముఖ్యంగా రక్త చరిత్ర చిత్రం సమయంలో శివ నిర్వాణ ఆర్జీవీకి కూలర్ బాయ్”గా పనిచేసిన విషయాన్నీ పంచుకున్నాడు. శివ నిర్వాణ సినీ పరిశ్రమకు రాకముందు సీరియల్స్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆర్జీవీ పట్ల ఉన్న అభిమానం, ఆయన చిత్రాల పట్ల ఉన్న మక్కువతో, అప్పట్లో నిర్మాణంలో ఉన్న రక్త చరిత్ర షూటింగ్ చూడాలని కోరుకున్నారు.
అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది
అయితే, ఆనాటి సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ల మధ్య అధికమైన హైరార్కీ ఉండేది. ఒక ప్రొడక్షన్ మేనేజర్ ద్వారా షూటింగ్‌కు వెళ్ళిన శివ నిర్వాణ, కూలర్ బాయ్‌తో మేనేజర్ మాట్లాడుతున్న సమయంలో, తానెందుకు RGVకి కూలర్ ఆపరేట్ చేయకూడదని ఆలోచించారట. ప్రొడక్షన్ మేనేజర్‌కు డబ్బులు అక్కర్లేదని, పని మాత్రం తాను చేస్తానని చెప్పి కూలర్ బాయ్ గా మారారట శివ. ఇలా శివ నిర్వాణ రక్త చరిత్ర చిత్రానికి 20 రోజులకు పైగా ఆర్జీవీకి కూలర్ బాయ్ గా పనిచేశారు. ఆఫీసులోని గదుల నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలోని కొండ ప్రాంతాల వరకు కూలర్‌ను మోసుకెళ్తూ, చెమటోడుస్తూ పనిచేశారట. నటుడు ఆశిష్ విద్యార్థిపై చిత్రీకరిస్తున్న కొండపై సన్నివేశంలో కూలర్‌ను మోసుకెళ్లడం సవాలుగా మారిందని. చిన్నప్పటి నుంచి ఇలాంటి పనులు చేయకపోయినా, సినిమాపై తనకున్న అభిరుచితో ఏదీ భారంగా భావించకుండా పనిచేశా అని తెలిపారు శివ నిర్వాణ.
మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!
ఆ 20 రోజుల అనుభవంలో ఆర్జీవీమేకింగ్‌ను, కెమెరా పనులను, లెన్సుల ఎంపికను, సౌండ్ డిజైనింగ్‌ను దగ్గర నుండి గమనించారట. ఆ సమయంలో ఆర్జీవీకి శివ నిర్వాణ చదువు గురించి కానీ, ఆయన కూలర్ బాయ్‌గా వచ్చారని కానీ తెలియదు. కేవలం ఒక రోజు ఆర్జీవీ పోస్టర్ల గురించి చర్చిస్తున్నప్పుడు, శివ నిర్వాణ ఒక కత్తి, రక్తంతో తడిసిన మంగళసూత్రం ఉన్న పోస్టర్ ఐడియాను ఆర్జీవీకి చూపించారట. ఆతర్వాత శివ నిర్వాణ దర్శకుడిగా మారి సినిమాలు చేసి హిట్స్ అందుకున్న తర్వాత ఒకరోజు అర్జీవికి తాను ఆయన దగ్గర పని చేసిన విషయాన్ని చెప్పాడట.. అది విని ఆర్జీవీ షాక్ అయ్యారట.
చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




