ఆ ఒక్క కారణంతోనే మొదటి సినిమాలో నటించ - రకుల్ ప్రీత్

24-08-2026

Pic credit - Instagram

Phani Ch

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన సినీ అరంగేట్రంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

రకుల్ మోడలింగ్ చేస్తున్న రోజుల్లో కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి మొదటి సినిమా అవకాశం వచ్చింది. ఆ సమయంలో నిర్మాతలు ఆ సినిమా కోసం రకుల్‌కు రూ. 5 లక్షల పారితోషికం ఆఫర్ చేయడం ఆమెను ఎంతగానో ఆకర్షించింది.

దాంతో నేను కారు కొనుక్కోవాలనుకున్నా. నా స్నేహితులందరిలో కారు ఉన్న మొదటి అమ్మాయిని నేనే అవుతానన్న ఒకే ఒక్క కారణంతో ఆ మూవీకి ఓకే చెప్పా తెలిపింది.

షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సినిమాల మేకింగ్, కెమెరా ముందు నటించడం ఆమెకు ఎంతో నచ్చింది. కేవలం పాకెట్ మనీ కోసం మొదలైన ప్రయాణం క్రమంగా నటనపై ఉన్నతమైన గౌరవాన్ని, ఇష్టాన్ని పెంచింది.

ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని టాప్ 5లో నిలిచిన రకుల్, మోడలింగ్ రంగంలో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు.

టాలీవుడ్‌లో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో భారీ విజయాన్ని అందుకుని రకుల్ ఒక్కసారిగా స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్నారు. వరుస హిట్లతో తెలుగులో అగ్ర కథానాయికగా తనకంటూ తిరుగులేని స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

జీవితంలో చిన్న అవకాశాలు కూడా ఊహించని పెద్ద విజయాలకు దారి తీస్తాయని రకుల్ ప్రయాణం నిరూపిస్తోంది. సినీ ప్రియులను ఆకట్టుకునే ఈ ఆసక్తికర కథనాన్ని మీ మిత్రులతో తప్పకుండా పంచుకోండి!