AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చల్లని వాతావరణంలో కప్పు అటుకులతో 5 నిమిషాల్లో కారంగా, పుల్లగా అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్!

సాయంత్రం కాగానే ఏదైనా వేడివేడిగా, కారంగా తింటూ టీ తాగాలనిపించడం సహజం. ముఖ్యంగా ఆకాశం మేఘావృతమై చల్లటి గాలి వీస్తున్నప్పుడు లేదా వర్షం పడుతున్నప్పుడు బయటి ఫాస్ట్ ఫుడ్ కంటే ఇంట్లోనే అప్పటికప్పుడు వేడిగా ఏదైనా చేసుకుంటే ఆ మజాయే వేరు. అలాంటి సమయాల్లో వంటింట్లో ఉండే సాధారణ అటుకులు, ఉల్లిపాయలతో కేవలం ఐదు నిమిషాల్లో స్ట్రీట్ స్టైల్ రుచితో ఎంతో కరకరలాడే 'అటుకుల స్నాక్' తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ క్విక్ ఈవెనింగ్ స్నాక్ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.

Phani CH
|

Updated on: Aug 24, 2026 | 9:35 PM

Share
కావలసిన పదార్థాలు: ఒకటి నుండి రెండు కప్పులు మందపాటి అటుకులు, గుప్పెడు వేరుశనగ గుళ్లు,  రెండు మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రెండు స్పూన్లు కారం పొడి, ఒక టీస్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, తాజా కొత్తిమీర తరుగు, రెండు నిమ్మకాయల రసం, ఒక స్పూన్ స్వచ్ఛమైన కరిగించిన నెయ్యి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె.

1 / 5
తయారీ విధానం: ముందుగా ఒక జల్లెడలో మందపాటి అటుకులను వేసి బాగా జల్లించుకోవాలి. ఇలా చేయడం వల్ల అటుకులలోని చిన్న రజను, పొడి అంతా పోయి నూనెలో వేయించినప్పుడు నూనె పాడవకుండా శుభ్రంగా ఉంటుంది.

2 / 5
స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడిచేయాలి. నూనె సరైన వేడికి వచ్చిన తర్వాత అటుకులను కొద్దికొద్దిగా వేసి వేయించాలి. అటుకులు వేగడానికి కేవలం 10 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. వెంటనే జాలి గరిటెతో నూనె లేకుండా తీసి, టిష్యూ పేపర్లు పరిచిన మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకోవాలి. నూనె కాగకుండా అటుకులు వేస్తే నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి, మరీ ఎక్కువ వేడిగా ఉంటే మాడిపోతాయి కాబట్టి మంటను గమనించుకోవాలి.

3 / 5
అదే నూనెలో గుప్పెడు పల్లీలను వేసి చిన్న మంటపై ఎర్రగా, కరకరలాడే వరకు వేయించి అటుకులున్న బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు గిన్నెను నెమ్మదిగా కదిలించి అడుగున ఉన్న టిష్యూ పేపర్లను తీసేయాలి. ఇప్పుడు వేయించిన అటుకులు, పల్లీల మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రెండు స్పూన్ల కారం పొడి, ఒక టీస్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి.

4 / 5
దీనిపై రెండు నిమ్మకాయల రసం మరియు ఒక చెంచా కరిగించిన స్వచ్ఛమైన నెయ్యిని వేయాలి. ఈ మిశ్రమాన్నంతటినీ చేత్తో లేదా గరిటతో ఉల్లిపాయలు, మసాలాలు అటుకులకు బాగా పట్టేలా కలపాలి. అంతే, ఎంతో ఘుమఘుమలాడే క్రిస్పీ అటుకుల స్నాక్ సిద్ధం! వర్షం పడుతున్నప్పుడు వేడివేడి టీతో పాటు ఈ కరకరలాడే అటుకుల చాట్ తింటుంటే ఆహా అనిపించక మానదు.

5 / 5
Follow Us