ఉత్తరప్రదేశ్ గోండాలో ఒక మహిళ భర్తకు తెలియకుండా దాదాపు ఎనిమిదేళ్లుగా రూ.12 లక్షలు పొదుపు చేసింది. బంగారు ఆభరణాలు కొనే ఆశతో దాచిన ఈ డబ్బును పెట్టెలో భద్రపరిచింది. తీరా పెట్టె తెరవగా, ఎలుకలు నోట్లన్నీ కొరికేసి నాశనం చేశాయి. దీంతో ఆమె ఆశలు అడియాశలయ్యాయి, తీవ్ర ఆవేదన చెందింది.