నటి అనసూయ భరద్వాజ్ భర్త చనిపోయిన మహిళలు బొట్టు, గాజులు తీసేయాలనే సంప్రదాయంపై తీవ్ర ప్రశ్నలు సంధించారు. తన తండ్రి మరణం తర్వాత తల్లి జీవితంలో వచ్చిన మార్పులు చూసి ఈ వ్యాఖ్యలు చేశారు. బొట్టు, గాజులు భర్తతో ముడిపడినవి కావని, వీటిని తీసేయాలనే ఆచారం ఎక్కడైనా రాసి ఉందా అని ఆమె ప్రశ్నించారు.