పూజిత పొన్నాడ .. తెలుగు, తమిళ చలనచిత్రాల్లో పనిచేస్తుంది. ఆమె 1989 అక్టోబర్ 5న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించింది.
చెన్నైలోని SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో B.Tech పూర్తిచేసిన ఆమె, నటనలోకి రాకముందు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఉద్యోగం చేసింది.
2015లో "ఉప్మా తినేసింది" అనే లఘుచిత్రంతో నటనా రంగంలోకి అడుగుపెట్టింది. 2016లో "ఊపిరి" చిత్రంలో చిన్న పాత్రతో తెలుగు సినిమాల్లోకి ప్రవేశించింది.
ఆమె 2018లో "రంగస్థలం" చిత్రంలో ఆది పినిశెట్టి ప్రియురాలి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
2019లో రాజశేఖర్ "కల్కి"లో రొమాంటిక్ ఎస్‌ఐ పాత్రలో మెప్పించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
"హ్యాపీ వెడ్డింగ్", "రాజు గాడు", "మిస్ ఇండియా", "రావణాసుర", "ఓదెల రైల్వే స్టేషన్". ఇటీవలే ఈ అమ్మడు హరిహర వీరమల్లు చిత్రంలో నటించింది.
పూజిత సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన ఫోటోలు, అప్‌డేట్‌లను అభిమానులతో పంచుకుంటుంది. పూజిత సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.