AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daliya Khichdi: నెలల పసిపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మేలు చేసే గోధుమ రవ్వ కిచిడి.. 

రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలనుకున్నప్పుడు లేదా ఇంట్లో పసిపిల్లలు, పెద్దవారికి పోషకాలు నిండిన బలవర్ధకమైన భోజనం పెట్టాలనుకున్నప్పుడు కిచిడీ సరైన ఎంపిక. ముఖ్యంగా గుజరాత్‌లోని కతియావాడీ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన 'దలియా కిచిడీ' రుచిలోనూ, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ఎంతో విశిష్టమైనది. ఎర్ర గోధుమ రవ్వ , పొట్టు పెసలు, రకరకాల తాజా కూరగాయలు, స్వచ్ఛమైన నెయ్యి కలిపి చేసే ఈ కిచిడీ పిల్లల ఎదుగుదలకు, గర్భిణీ స్త్రీలకు మరియు బరువు తగ్గాలనుకునే డైట్ ప్రియులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ రుచికరమైన కిచిడీ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.

Phani CH
|

Updated on: Aug 24, 2026 | 9:19 PM

Share
కావలసిన పదార్థాలు: అర కప్పు గోధుమ రవ్వ అరగంట నానబెట్టినది,  అర కప్పు పొట్టు పెసలు గంటపాటు నానబెట్టినవి, ముప్పావు కప్పు బియ్యం లేదా మిల్లెట్స్, మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి, ఒక బిర్యానీ ఆకు, అంగుళం ముక్క దాల్చిన చెక్క, ఐదు లవంగాలు, నాలుగు యాలకులుఒక టీస్పూన్,  జీలకర్ర, ఒక టీస్పూన్ అల్లం తరుగు, ఒక పచ్చిమిర్చి,  రెండు ఎండుమిర్చి,  ఒక తరిగిన ఉల్లిపాయ,  అర కప్పు క్యారెట్ ముక్కలు,  మూడు ఫ్రెంచ్ బీన్స్, ఒక బంగాళాదుంప ముక్కలు, ఒక టమాటా, పావు కప్పు పచ్చి బఠాణీ, పావు కప్పు స్వీట్ కార్న్, పుదీనా తరుగు, అర టీస్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్,  కారం,  రుచికి సరిపడా ఉప్పు, ఒకటిన్నర లీటర్లు నీళ్లు .

1 / 5
తయారీ విధానం: ముందుగా కుక్కర్‌లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడిచేయాలి. నెయ్యి కాగిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు మరియు జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలి.

2 / 5
అనంతరం క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, బంగాళాదుంప ముక్కలు వేసి మూడు నుండి నాలుగు నిమిషాలు ఫ్రై చేయాలి. మీకు నచ్చితే లేత సొరకాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఆపై అరగంట నానబెట్టిన గోధుమ రవ్వ, గంటపాటు నానబెట్టిన పొట్టు పెసలు, కడిగిన బియ్యం మరియు టమాటా ముక్కలు వేసి మీడియం మంటపై రెండు నిమిషాలు వేపాలి.

3 / 5
ఇప్పుడు పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, తాజా పుదీనా ఆకులు, పచ్చి బఠాణీ మరియు స్వీట్ కార్న్ గింజలు వేసి బాగా కలపాలి. కూరగాయలు, రవ్వ చక్కగా కలిసిన తర్వాత ఒకటిన్నర లీటర్ల నీళ్లు పోసి కలపాలి. కుక్కర్ మూత పెట్టి మీడియం-హై ఫ్లేమ్‌పై ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి.

4 / 5
ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. కిచిడీలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల చల్లారే కొద్దీ గట్టిపడుతుంది. అలాంటప్పుడు కాసిన్ని వేడినీళ్లు పోసి ఒక్క నిమిషం కలుపుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో కమ్మనైన కతియావాడీ దలియా కిచిడీ సిద్ధం! వేడివేడి కిచిడీపై కాస్త నెయ్యి వేసుకుని పెరుగు చట్నీ లేదా ఆవకాయ, అప్పడాలతో తింటే పొట్టకు ఎంతో హాయిగా, అమృతంలా ఉంటుంది!

5 / 5
Follow Us
నెలల పసిపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మేలు చేసే గోధుమ రవ్వ కిచిడి

పవిత్ర సోమవారం శివాలయంలో ప్రత్యక్షమైన నాగేంద్రుడు

గులాబీలు విరగ పూయాలి అంటే ఇది ఒక్క స్పూన్ వేయండి చాలు

నూనె ట్యాంకర్ బోల్తా.. ఆ తర్వాత సీన్ ఇదే! వీడియో వైరల్

ఇలా కూడా ఔటవుతారా.. ఆ ఒక్క తప్పుతో ఊహించని షాకిచ్చిన అంపైర్..

ఈ కామర్స్ కంపెనీలకు షాక్.. ఆన్‌లైన్ లో ఈ పండు కొంటే నేరమే!

జలుబు పట్టిందా? మందులకంటే ముందు ఈ డ్రింక్స్ ట్రై చేయండి!

OTTలో భయానక హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది.. పెద్దలకు మాత్రమే

మనసున్న కలెక్టర్ .. మాన‌వ‌త్వంతో స్పందించారు

యూపీఐ ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తే ఐటీ నోటీసులొస్తాయా?