హార్ముజ్ లో భారతీయ నౌకపై దాడి.. ఒకరు గల్లంతు!
US Iran War: పశ్చిమాసియా సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ భారతీయుడు అదృశ్యం కావడంతో అతడి ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.

US Iran War: పశ్చిమాసియా సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ భారతీయుడు అదృశ్యం కావడంతో అతడి ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.
24 మంది భారతీయులు.. నౌకపై దాడితో కలకలం!
పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ తారా గ్యాస్ (MT Tara Gas) అనే ఎల్‌పీజీ ట్యాంకర్‌పై నవంబర్ 16న హార్ముజ్ జలసంధిలో దాడి జరిగినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. ఆ సమయంలో నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దాడి జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. 21 మందిని బయటకు తీసుకొచ్చి ఒమన్‌లోని ఖసబ్ ప్రాంతానికి తరలించారు. గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఒక భారతీయుడి ఆచూకీ లభించలేదు. అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
గల్లంతైన భారతీయుడి కోసం ముమ్మర గాలింపు!
ఈ ఘటనపై ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ప్రమాద సమయంలో స్పందించి భారతీయ సిబ్బందిని రక్షించడంలో సహకరించిన ఒమన్ ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. గాయపడిన ఇద్దరు భారతీయులకు వైద్య సహాయం అందిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పింది.
⚠️ IMPORTANT UPDATE ⚠️
On Nov 16, Panama-flagged LPG tanker TARA GAS, carrying 24 Indian seafarers, was targeted in a missile attack in the Strait of Hormuz.
All 24 Indian nationals, along with the entire 25-member crew, are completely safe with no injuries.
We are continuously monitoring the situation and remain in close contact with the ship management company to ensure the ongoing security and wellbeing of our seafarers.
— Sarbananda Sonowal (@sarbanandsonwal) November 17, 2026
వాణిజ్య నౌకలపై దాడులు ఆపాలి.. భారత్ తీవ్ర హెచ్చరిక!
హార్ముజ్ జలసంధిలో జరిగిన ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇలాంటి దాడులు సముద్ర రవాణాలో పనిచేస్తున్న సాధారణ పౌరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నాయని, నౌకలపై వరుసగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది. వాణిజ్య నౌకలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని కోరింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలు, వాణిజ్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని స్పష్టం చేసింది.
ప్రపంచానికి కీలక సముద్ర మార్గం హార్ముజ్
హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గాల్లో ఒకటి. ముఖ్యంగా చమురు, సహజ వాయువు రవాణాలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. గల్ఫ్ ప్రాంతంలోని దేశాల నుంచి ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు ఇంధన సరఫరా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇక్కడ నౌకల రాకపోకలకు అంతరాయం కలిగితే అంతర్జాతీయ వాణిజ్యంతో పాటు ఇంధన సరఫరాపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి కీలకమైన ప్రాంతంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం అందరి దృష్టి గల్లంతైన భారతీయుడి ఆచూకీ పైనే ఉంది. అతడిని సురక్షితంగా గుర్తించాలని భారత అధికారులు, కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు.