Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్.. ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. సంక్రాంతికి సొంతూరు వెళ్లే, శబరిమల వెళ్లే భక్తుల కోసం స్పెషల్ ట్రైన్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే నడుస్తున్న ఈ రైళ్లను మరింత పొడిగించింది. ప్రజలు వీటిని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. వీటిల్లో రిజర్వేషన్లు స్టార్ట్ అయ్యాయి.

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులతో పాటు సంక్రాంతి పండుగ రానున్న క్రమంలో రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగనుంది. పలు మార్గాల్లో వెళ్లే రూట్లలో విపరీతమైన రద్దీ ఏర్పడనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ఇప్పటినుంచే చర్యలు చేపడుతోంది. ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేసేందుకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా హైదరాబాద్- మంగళూరు సెంట్రల్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లను మరిన్ని రోజుల పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ రైళ్ల షెడ్యూల్ వివరాలు ఇవిగో..
ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ వివరాలు..
హైదరాబాద్- మంగళూరు సెంట్రల్ ప్రత్యేక రైళ్లు(07097) డిసెంబర్ 2 నుంచి జనవరి 27వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఇవి ప్రతీ బుధవారం సర్వీసులు అందిస్తాయి. ఈ తేదీల మధ్య మొత్తం 9 సర్వీసులు అందించనుంది. ఇక తిరుగు ప్రయాణంలోమంగళూరు సెంట్రల్ – హైదరాబాద్(07098) డిసెంబర్ 3 నుండి జనవరి 28 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. ఇది మొత్తం 9 సర్వీసులు అందిస్తుంది.
ఆగే స్టేషన్లు ఇవే..
ఈ ప్రత్యేక రైళ్లు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, సేడం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, కృష్ణరాజపురం, బంగారుపేట, కుప్పం, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోదనూర్, పాలక్కాడ్, షోరనూర్, తిరూర్, కోజికోడ్, వడకర, తలస్సేరి, కన్నూర్, పయ్యనూర్, కన్హంగాడ్, కాసరగోడ్ స్టేషన్లలో ఆగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తన ప్రకనటలో వెల్లించింది. వీటిల్లో జనరల్, స్లీపర్ కోచులతో పాటు ఏసీ బోగీలు అందుబాటులో ఉంటాయి. అయితే రానున్న రోజుల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది.
