AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ester Noronha: ఆ తెలుగు హీరో పెద్ద చదువులు చదివాడు.. నాకు చాలా మంచి ఫ్రెండ్.. ఆసక్తికర విషయం చెప్పిన ఎస్తర్

టాలీవుడ్ నటి ఎస్తర్ నోరోన్హా ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో ఓ తెలుగు హీరో గురించి కూడా మాట్లాడిందీ ముద్దుగుమ్మ.

Ester Noronha: ఆ తెలుగు హీరో పెద్ద చదువులు చదివాడు.. నాకు చాలా మంచి ఫ్రెండ్.. ఆసక్తికర విషయం చెప్పిన ఎస్తర్
Ester Noronha
Basha Shek
|

Updated on: Jul 12, 2026 | 3:11 PM

Share

కర్ణాటకలోని ఉడిపికి చెందిన ఎస్తేర్ నొరోన్హా ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. తెలుగులో సాయిరామ్ శంకర్ నటించిన 1000 అబద్ధాలు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. భీమవరం బుల్లోడు, గరం, జయ జానకి నాయక, ఐరావతం, 69 సంస్కార్ కాలనీ, చెంగురే బంగారు రాజా, డెవిల్, టెనెంట్, థలా తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు పలు కన్నడ సినిమాల్లో నటించింది ఎస్తర్. అయితే హీరోయిన్ గా మాత్రం క్రేజ్ సొంతం చేసుకోలేకపోయింది. దీంతో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ చేసింది. సినిమాల సంగతి పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంద ఎస్తర్. సినిమా కెరీర్ బిజీగా ఉన్న టైంలోనే టాలీవుడు నటుడు, ర్యాపర్ కమ్ సింగర్ అయిన నోయల్‏ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2019లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. అయితే పెళ్లైన కొన్ని నెలలకే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకుల తర్వాత మళ్ల ప్రొఫెషనల్ లైఫ్ పై దృష్టి సారించింది ఎస్తర్. ప్రస్తుతం ఆమె పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఎస్తర్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో హీరో సునీల్‌తో తననకున్న అనుబంధాన్ని కూడా వివరించింది.

‘భీమవరం బుల్లోడు సినిమాలో నేను, సునీల్ కలిసి పనిచేశాం. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం క్రమంగా మంచి స్నేహంగా మారింది. సినిమా అనేది ఒక కమ్యూనికేషన్ . కళ అంటే సమాజానికి ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పడం. కానీ నేను, సునీల్ గారు కలిసినప్పుడు మాత్రం సినిమాల గురించి అసలు మాట్లాడుకోం. ఆయన ఇండస్ట్రీలో పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తుల్లో ఒకరు. మా ఇద్దరి ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ కూడా దాదాపు ఒకేలా ఉంటుంది. అందుకే మా ఆలోచనలు కూడా చాలావరకు కలుస్తాయి. మా ఇద్దరి ఐక్యూ లెవెల్స్ కూడా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. సునీల్ గారికి సామాజిక సమస్యలపై చాలా అవగాహన ఉంది. ఎల్జీబీటీ వంటి సున్నితమైన అంశాల గురించి కూడా నాతో చాలా సార్లు చర్చించారు. ఒక నటుడిగా మాత్రమే కాకుండా బాధ్యతగల వ్యక్తిగా ఆయన ఆలోచించే తీరు నాకు బాగా నచ్చుతుంది. ఇండస్ట్రీలో చాలా మంది సినిమాల గురించే మాట్లాడుకుంటే.. మేం మాత్రం సమాజాన్ని, విజ్ఞానాన్ని గురించి చర్చించుకుంటాం. మేం ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటాం. ఒకే విధమైన ఆలోచనా విధానం, పుస్తకాలపై ఆసక్తి, సామాజిక అంశాలపై చర్చలే మా స్నేహానికి పునాది’ అని ఎస్తర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

నటి ఎస్తర్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

nbsp;

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల