AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Janaki: మహానటి సావిత్రికి పాటలు పాడనని శపథం చేసిన జానకమ్మ.. చివరి వరకు అదే మాట మీదే.. ఎందుకో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో జానకమ్మది ప్రత్యేక నేపథ్యం. తెలుగుతో పాటు ఎన్నో భాషల్లో వేలాది పాటలు పాడారు. ఎందరో దిగ్గజ సంగీత దర్శకుల వద్ద పనిచేశారు. అయితే ఒక సందర్భంలో జానకి మహానటి సావిత్రి సినిమాలకు పాటలు పాడనని తెగేసి చెప్పారు. చివరి వరకు కూడా అదే మాట మీద నిలబడ్డారీ లెజెండరీ సింగర్.

Singer Janaki: మహానటి సావిత్రికి పాటలు పాడనని శపథం చేసిన జానకమ్మ.. చివరి వరకు అదే మాట మీదే.. ఎందుకో తెలుసా?
Janaki, Savitri
Basha Shek
|

Updated on: Jul 12, 2026 | 6:13 PM

Share

లెజెండరీ గాయని ఎస్. జానకి మరణంతో యావత్ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదలు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ దిగ్గజ గాయని మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక సంగీత ప్రియులైతే జానకమ్మ పాటలను గుర్తు చేసుకుంటూ ఆమెకు స్వర నివాళి అర్పిస్తున్నారు. జానకమ్మ గాన ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. తెలుగు, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు అనేక భారతీయ, విదేశీ భాషల్లో నూ పాటలు పాడారు జానకమ్మ. ఏడు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో దాదాపు 20 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారామె. ఎంతో మంది దిగ్గజ సంగీత దర్శకుల దగ్గర పనిచేసి తన గాన ప్రతిభతో స్వర కోకిల, గాన కోకిల అని బిరుదులు సొంతం చేసుకున్నారు. అయితే తన జీవిత కాలంలో ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్ల సినిమాలకు పాటలు పాడిన జానకమ్మ ఒక సందర్భంలో మహానటి సావిత్రి పాడనని శపథం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా జానకమ్మనే పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు

వివరాల్లోకి వెళితే.. సావిత్రి సినిమాలకు ఎక్కువగా పి. లీల, పి. సుశీల పాటలు పాడేవారు. ముఖ్యంగా ఆమె హావభావాలకు, నటనకు సుశీలమ్మ గొంతు మాత్రమే సరిగ్గా బాగా సరిపోతుందని సావిత్రి గట్టిగా నమ్మేవారు. దీంతో తన సినిమాలకు సుశీల మాత్రమే పాడాలనే నియమం పెట్టుకున్నారట సావిత్రమ్మ. అయితే ఈ విషయం తెలియని జానకమ్మ ఓ తమిళ సినిమాలో సావిత్రి పాటను ఆలపించారు. పాట కూడా ఎంతో అద్భుతంగా వచ్చింది. అయితే సావిత్రం మాత్రం జానకమ్మ పాడిన పాటను పక్కన పెట్టి మళ్లీ సుశీలమ్మతో పాడించి రీ రికార్డింగ్ చేయించారు. దీంతో నొచ్చుకున్న జానకమ్మ అప్పటి నుంచి సావిత్రి పాటలను పాడకూడదని నిర్ణయం తీసుకున్నారు.

ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో జానకమ్మ మాట్లాడుతూ.. ‘సావిత్రికి సుశీల గాత్రం అంటే ఇష్టం. ఆమె అభినయానికి సుశీల అయితేనే బాగుంటుంది అని ఆమె అభిప్రాయం. అందుకే నేను పాడతా అంటే ఆమె ఒప్పుకునేవారు కాదు. అలా ‘నీలీల పాడేద దేవ పాటను కూడా నేను పాడను’ అనిచెప్పేశాను. సావిత్రి సినిమా కావడంతో ఈ పాటను పాడటానికి 3 నెలలు పెండింగ్ లో పెట్టాను. చివరకు ఆ పాటలో సావిత్రి నటించడంలేదు అని దర్శక నిర్మాతలు చెప్పడంతోనే పాడటానికి అంగీకరించాను. కానీ చివరకు ఆ పాటలో సావిత్రి నటించింది’ అని అన్నారు. జానకమ్మ మరణం నేపథ్యంలో ఇప్పుడీ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రోటీన్ షేక్ కాదు.. రోహిత్ శర్మ లేట్ నైట్ ఫేవరేట్ ఫుడ్ ఇదే
ప్రోటీన్ షేక్ కాదు.. రోహిత్ శర్మ లేట్ నైట్ ఫేవరేట్ ఫుడ్ ఇదే
ఐస్‌క్యూబ్‌లతో అద్భుతం.. ఒక్క ఒక్కసారి రాస్తే చాలు..
ఐస్‌క్యూబ్‌లతో అద్భుతం.. ఒక్క ఒక్కసారి రాస్తే చాలు..
భయం పుట్టించే మిస్టీరియస్ హారర్.. ఓటీటీలోకి వచ్చేసింది..
భయం పుట్టించే మిస్టీరియస్ హారర్.. ఓటీటీలోకి వచ్చేసింది..
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది
ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!
రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?