AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venky Movie: బ్లాక్ బస్టర్ సినిమా ‘వెంకీ’ని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు వేల కోట్ల మహారాణి

మాస్ మహరాజా రవి తేజ హీరోగా నటించిన వెంకీ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. శ్రీనువైట్ల తెరకెక్కించిన ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్లలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సంబంధించి ఒక విషయం చాలా మందికి తెలియదు.

Venky Movie: బ్లాక్ బస్టర్ సినిమా 'వెంకీ'ని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు వేల కోట్ల మహారాణి
Venky Movie
Basha Shek
|

Updated on: Jul 13, 2026 | 7:52 PM

Share

మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో మర్చిపోలేని చిత్రం వెంకీ. 2004లో రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ట్రైన్ సీన్స్ అయితే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. రవితేజ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, వేణుమాధవ్, బ్రహ్మానందం, ఏవీఎస్ ల కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు ఆడియెన్స్. కేవలం కామెడీ మాత్రమే కాదు ఈ సినిమాలో ఒక థ్రిల్లింగ్ మర్డర్ మిస్టరీ కూడా ఉంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి. అందుకే ఈ సినిమా విడుదలై 22 ఏళ్లు పూర్తైనా ఇప్పటికీ టీవీలో వస్తే అసలు వదిలిపెట్టరు. దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాపూ బొమ్మ స్నేహ హీరోయిన్ గా నటించింది. అలాగే రాశి ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ స్నేహ పోషించిన శ్రావణి పాత్రకు మొదట వేరొకరిని అనుకున్నారట. అయితే ఆమె రిజెక్ట్ చేయడంతో స్నేహకు అవకాశం వచ్చిందట. అలా ఈ వెంకీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ మరెవరో కాదు గజిని ఫేమ్ ఆసిన్.

వెంకీ సినిమాలో హీరోయిన్ గా మొదట ఆసిన్ ను తీసుకోవాలనుకున్నారట మేకర్స్. ఆమెను కలిసి కథ కూడా చెప్పారట. స్టోరీ విని ఆసిన్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యిందట. అయితే అప్పటికే ఆసిన్ చేతిలో చాలా సినిమాలు పెండింగ్ ఉన్నాయట. డేట్స్ ఖాళీగా లేకపోవడంతో వెంకీ సినిమాను వదిలేసుకుందట. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీను వైట్ల స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.

ఇవి కూడా చదవండి

కాగా తెలుగు, తమిళంతో పాటు హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఆసిన్. ముఖ్యంగా తెలుగులో రవితేజ, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో హిట్ సినిమాలు చేసిందీ ముద్దుగుమ్మ. అలాగే తమిళ్ లో అజిత్, సూర్య, విజయ్ లతో నటించింది. ఇక గజినీ సినిమా ఈ అమ్మడి కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే మైక్రో మ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మతో ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆసిన్. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యిందీ ముద్దుగుమ్మ. అయితే ఈ ముద్దుగుమ్మ ఆస్తుల విలువ దాదాపు రూ. 1500 కోట్లకు పైమానేనని సమాచారం.

భర్తతో ఆసిన్..

View this post on Instagram

A post shared by Asin Suriya (@asin.suriya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us