AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brigida Saga: సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న యంగ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. కాబోయే భర్త ఎవరో తెలుసా?

తమిళ సీరియల్స్ తో పాటు తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోన్న నటి బ్రిగిడ సాగ శుభవార్త చెప్పింది. త్వరలోనే యంగ్ హీరోయిన్ పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా ఈ ముద్దగుమ్మ ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా ఆమెనే సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Brigida Saga: సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న యంగ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. కాబోయే భర్త ఎవరో తెలుసా?
Brigida Saga
Basha Shek
|

Updated on: Jul 13, 2026 | 10:14 PM

Share

బ్రిగిడా సాగా.. పేరు చెబితే కొందరు గుర్తు పట్టకపోవచ్చు కానీ పై ఫొటో చూస్తే ఈ డస్కీ బ్యూటీని ఇట్టే గుర్తు పడతారు. తమిళ సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. ఇక తెలుగులోనూ ఈముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది. 2019లో వచ్చిన ఆహా కళ్యాణం అనే వెబ్ సిరీస్ తో తెలుగు ఆడయెన్స్ ను పలకరించింది బ్రిగిడ సాగ. ఇందులో తన అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత సింధూరం సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించింది. అలాగే పెద కాపు సినిమాలోనూ మెరిసింది. అయితే గత కొన్ని రోజులుగా సినిమాలతో పాటు లవ్, డేటింగ్ వంటి విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోందీ ముద్దుగుమ్మ. కొద్ది రోజుల క్రితమే సోషల్ మీడియా వేదికగా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది బ్రిగిడ. కోలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు అనంత్‌తో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది. అతని పుట్టిన రోజు సందర్భంగా ఈ శుభవార్తను సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ఇది జరిగి నెల రోజులు కాలేదు అప్పుడే మరో శుభవార్త చెప్పిందీ ముద్దుగుమ్మ.

బ్రిగిడ- అనంత్ ల ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. సోమవారం సాయంత్రం ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా నటినే సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీందో కొన్ని నిమిషాల్లోనే ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు బ్రిగిడ- అనంత్ లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

బ్రిగిడ- అనంత్ ల ఎంగేజ్మెంట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by BRIGIDA SAGA (@brigida_saga)

కాబోయే భర్తతో బ్రిగిడ సాగా..

View this post on Instagram

A post shared by BRIGIDA SAGA (@brigida_saga)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us