AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్.. ‘నాగబంధం’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

‘పెదకాపు’ ఫేమ్ విరాట్‌ కర్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్'. అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ లో నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. జులై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్.. 'నాగబంధం' స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Nagabandham Movie
Basha Shek
|

Updated on: Jul 15, 2026 | 7:00 AM

Share

ఈ మధ్యన ప్రచార చిత్రాలతో బాగా ఆసక్తి కలిగించిన సినిమా ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ లో ‘పెదకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ కథానాయకుడిగా నటించాడు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే వీరితో పాటే జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, మహేశ్ మంజ్రేకర్, గరుడ రామ్, జయ ప్రకాష్, మురళీ శర్మ, బీఎన్ అవినాష్ , రిషభ్ సావ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి సంయుక్తంగా సుమారు రూ.100 భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య జులై 03న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ బంధం డీసెంట్ టాక్ తెచ్చుకుంది. కంటెంట్ పరంగా మెప్పించకపోయినా వీఎఫ్ ఎక్స్, అద్భుతమైన విజువల్స్ ఆడియెన్స్ ను కట్టిపడేశాయి. అందుకే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. కాగా థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన నాగబంధం సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విజువల్ వండర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

కాగా థియేటర్లలో విడుదల కంటే ముందు ‘నాగబంధం’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అలాగే తెలుగు శాటిలైట్ హక్కులను స్టార్ మా… అలాగే తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ శాటిలైట్ (టీవీ రైట్స్)ను ‘జీ నెట్వర్క్’ సొంతం చేసుకున్నాయి. డీల్ ప్రకారం థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ లెక్కన ఆగస్టు మొదటి వారంలో నాగబంధం సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. అయితే హిందీలో ఎనిమిది వారాల తర్వాతే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై ఒక అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియో చేతికి నాగ బంధం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us