Ram Charan: రామ్ చరణ్-ఉపాసనల డ్రీమ్ ఫామ్ హౌస్.. త్వరలోనే గృహ ప్రవేశం.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
'పెద్ది' సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. జూన్ 04న విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తన తర్వాతి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు చెర్రీ.

‘పెద్ది’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. గత నెలలో రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొడుతోంది. పెద్ది తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు రామ్ చరణ్. రంగ స్థలం వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత వీరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ సారి రామ్ చరణ్ వేరే వియంతో వార్తల్లో నిలిచాడు. అదేంటంటే.. ఈ మెగా హీరో కొత్తగా ఒక ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడట. తన అభిరుచికి తగ్గట్టుగా నిర్మించుకున్న ఈ ఫామ్ హౌస్ గృహ ప్రవేశం ఉండనుందట. హైదరాబాద్ శివారులోని చేవెళ్ల-మోకిల పరిసర ప్రాంతంలో చాన్నాళ్ల క్రితమే రామ్ చరణ్-ఉపాసన 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారట. ఇప్పుడు ఇందులోనే విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ని ఇప్పుడు నిర్మించుకున్నట్లు తెలుస్తోంది.
నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలోనే గృహప్రవేశం కూడా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా మోడ్రన్ టెక్నాలజీకి తగ్గట్లే ఇంటీరియర్, పచ్చదనం, ఆర్కిటెక్చర్ లాంటివి ఈ ఫామ్ హౌస్‌లో ఉండబోతున్నాయట. కేవలం విశ్రాంతి కోసం మాత్రమే కాకుండా, ప్రకృతికి దగ్గరగా కుటుంబంతో సమయం గడిపేందుకు, ఆర్గానిక్ వ్యవసాయం చేసేందుకు ప్రత్యేకంగా ఈ ఫామ్ హౌస్ రూపొందించినట్లు తెలుస్తోంది. లగ్జరీ బెడ్‌రూమ్స్, విశాలమైన లివింగ్ స్పేస్, మోడ్రన్ కిచెన్, భారీ స్విమ్మింగ్ పూల్, జిమ్, మినీ థియేటర్, ఇండోర్ అండ్ ఔట్‌డోర్ లాంజ్ ఏరియాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియా, అతిథుల కోసం ప్రత్యేక గెస్ట్ సూట్స్, భారీ లాన్ కూడా ఈ డీమ్ ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా నిలువనున్నాయంట.
కాగా నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని త్వరలోనే తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో గృహప్రవేశ వేడుక నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు రామ్ చరణ్ లేదా ఆయన కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




