AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: లేడీ పవర్ స్టార్ కోసమైనా చూడాలి.. OTTలోకి వచ్చేసిన సాయి పల్లవి తొలి హిందీ సినిమా.. తెలుగులోనూ ఉంది

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించిన తొలి హిందీ సినిమా ఏక్ దిన్. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఇందులో హీరోగా నటించాడు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: లేడీ పవర్ స్టార్ కోసమైనా చూడాలి.. OTTలోకి వచ్చేసిన సాయి పల్లవి తొలి హిందీ సినిమా.. తెలుగులోనూ ఉంది
Ek Din Movie
Basha Shek
|

Updated on: Jul 16, 2026 | 10:31 AM

Share

టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హిందీలో నటించిన మొదటి సినిమా ఏక్ దిన్. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. మే 1న హిందీతో పాటు తెలుగులోనూ రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఇక తెలుగులో అయితే కేవలం సాయి పల్లవి కోసమే థియేటర్ కు వెళ్లారు ఆడియెన్స్. మొత్తానికి థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఏక్ దిన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం (జులై 15) నుంచే సాయి పల్లవి-జునైద్ ఖాన్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ప్రస్తుతానికి ఈ మూవీ ఇండియన్ ప్రేక్షకులకు అందుబాటులో లేదు. ఓవర్సీస్ ఆడియన్స్ కు మాత్రమే చూసే అవకాశం ఉంది. అది కూడా రెంటల్ విధానంలో. అయితే జులై 17 (శుక్రవారం) నుంచి ఇండియన్ ఆడియన్స్‌కు కూడా ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఏక్ దిన్ సినిమాకు సునీల్ పాండే దర్శకత్వం వహించారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మన్సూర్ ఖాన్, ఆమిర్ ఖాన్, అపర్ణా పురోహిత్ ఈ సినిమాను నిర్మించారు. రామ్ సంపత్ సంగీతం అందించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ‘వన్ డే’ థాయ్ అనే సినిమా ఆధారంగా ఏక్ దిన్ సినిమాను రూపొందించారు. దినేష్ (జునైద్ ఖాన్) ఒక ఐటీ ఉద్యోగి. అదే ఆఫీస్ లో పనిచేసే తన కొలీగ్ మీరా( సాయి పల్లవి)ని చూసి ఇష్టపడతాడు. కానీ మీరా తన బాస్‌తో రిలేషన్‌లో ఉంటుంది. ఓసారి ఆఫీస్ కొలీగ్స్ అంతా కలిసి జపాన్ ట్రిప్ వెళ్తారు. అక్కడ తన ప్రేమ విషయం మీరాతో చెప్పాలని ప్రయత్నిస్తాడు దినేష్. మరి మీరాకు తన ప్రేమ విషయం చెప్పాడా? ఈ జర్నీలో మీరా దినేష్ ఒకరి గురించి ఒకరు ఎలా తెలుసుకున్నారు? ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో సాయి పల్లవి సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us