AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni: ‘అయ్యగారి’ని కలిశానోచ్.. ఎట్టకేలకు అఖిల్‌ను కలిసిన వీరాభిమాని.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

'అయ్యగారే నెంబర్ వన్' అంటూ అక్కినేని అఖిల్ ను అమితంగా అభిమానిస్తుంటాడు గుంటూరుకు చెందిన నాగరాజు. ముఖ్యంగా అఖిల్ కొత్త సినిమా రిలీజైనప్పుడల్లా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటాడీ డై హార్ట్ ఫ్యాన్. అయితే ఇప్పటివరకు అతనికి అఖిల్ ను ప్రత్యక్షంగా కలిసే అవకాశం రాలేదు. ఎట్టకేలకు లెనిన్ సినిమా పుణ్యమా అని ఇప్పుడు ఆ కల నెరవేరింది.

Akhil Akkineni: 'అయ్యగారి'ని కలిశానోచ్.. ఎట్టకేలకు అఖిల్‌ను కలిసిన వీరాభిమాని.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు
Akhil Akkineni
Basha Shek
|

Updated on: Jul 16, 2026 | 6:20 AM

Share

ఎట్టకేలకు తన ‘అయ్యగారి’ని కలిశాడీ వీరాభిమాని. తన అభిమాన హీరో కళ్ల ముందు కనిపించే సరికి అతను ఆనందం పట్టలేకపోయాడు. ఉబికి వస్తోన్న కన్నీళ్లతో హీరో వద్దంటున్నా అతని కాళ్లమీద పడబోయాడు. ఇంకోసారి ఈ అవకాశం వస్తుందో రాదో అనుకుని గట్టిగా హత్తుకున్నాడు. ఈ జన్మకు ఇది చాలని ఎమోషనల్ అయ్యాడు… ఇది బుధవారం రాత్రి (జులై 15) హీరో అఖిల్ అక్కినేనిని కలిసినప్పుడు అతని వీరాభిమాని పొందిన ఆనంద క్షణాలు. ‘ అయ్యగారే నెంబర్ వన్’ అంటూ సోషల్ మీడియాలో సందడి చేసే అఖిల్ వీరాభిమాని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అఖిల్ సినిమా రిలీజైనప్పుడల్లా థియేటర్ల దగ్గర తెగ సందడి చేస్తుంటాడు గుంటూరుకు చెందిన నాగరాజు. అలా ఇటీవల లెనిన్ సినిమా రిలీజ్ సమయంలోనూ థియేటర్ కు వచ్చి తెగ సందడి చేశాడు నాగరాజు. హీరో కటౌట్లకు పూజలు చేయడం, కొబ్బరి కాయలు కొట్టడం ఇలా ఎన్నో పనులతో అఖిల్ పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల బాగా వైరల్ అయ్యాయి. హీరో అఖిల్ కూడా ఈ వీడియోలను చూసి బాగా మురిసిపోయాడు. అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా నాగరాజును కలుస్తానని కూడా మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నాడు అక్కినేని అందగాడు.

బుధవారం నాగరాజును తన దగ్గరకు పిలిపించుకున్నాడు అఖిల్. అంతే.. తన అభిమాన హీరోను కళ్ల ముందు చూసే సరికి నాగరాజు ఆనందం పట్టలేకపోయాడు. అఖిల్ వద్దంటున్నా అతని కాళ్ల మీద పడబోయాడు. చివరకు తన హీరోను గట్టిగా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ జన్మకు ఇది చాలాని ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు బాగా ఎమోషనల్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక నాగరాజు విషయానికి వస్తే.. ఇతనిది గుంటూరు. రోడ్డుపై పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే.. నాగరాజు కేవలం అఖిల్ సినిమా రిలీజైనప్పుడు మాత్రమే కనిపిస్తాడు. మిగతా సమయాల్లో పండ్ల వ్యాపారం పనిలోనే నిమగ్నమై ఉంటాడు. ఇక ఒక హీరో అభిమానులు మరో హీరోపై ట్రోలింగ్ లు, ఫ్యాన్ వార్లు చేసుకుంటారు. కానీ నాగరాజు మాతరం వీటికి చాలా దూరంగా ఉంటాడు. సోషల్ మీడియాలో తనకున్న గుర్తింపుతో చాలా సులభంగా డబ్బు సంపాదించుకునే అవకాశముంది. కానీ నాగరాజుకు మాత్రం అలాంటి ఆశలేమీ లేవు. ఒక సాధారణ అభిమానిగానే ఉండడానికి అతను ఇష్టపడుతున్నాడు.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us