AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Rules: సేవింగ్స్ అకౌంట్లో ఆ లిమిట్‌కు మించి ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా..? ఏ క్షణమైనా ఐటీ నోటీసులు.. జైలుకు గ్యారెంటీ

బ్యాంక్ అకౌంట్లలో ఎంత అయినా డబ్బులు దాచుకోవచ్చు. కానీ మీ దాచుకున్న డబ్బుకు ఆధారాలు ఉండాలి. అకస్మాత్తుగా మీ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపితే ఐటీ శాఖ నిఘాలోకి వెళుతుంది. మీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

Income Tax Rules: సేవింగ్స్ అకౌంట్లో ఆ లిమిట్‌కు మించి ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా..? ఏ క్షణమైనా ఐటీ నోటీసులు.. జైలుకు గ్యారెంటీ
Bank Account
Venkatrao Lella
|

Updated on: Jul 16, 2026 | 11:28 AM

Share

సడెన్‌గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తున్నారా..? రూ.లక్షల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నారా..? ఐటీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారా..? మీరు అలా అనుకుంటే పొరపాటే. బ్యాంకు అకౌంట్లో ఎంత ధనాన్ని అయినా దాచుకోవచ్చు. కానీ ఐటీ శాఖ కొన్ని పరిమితులు విధించింది. ఈ పరిమితులకు మించి పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు చేస్తే బ్యాంకుల ద్వారా ఐటీ శాఖకు సమాచారం వెళుతుంది. మీ ఆదాయానికి మించి మీరు ట్రన్సాక్షన్లు నిర్వహించినట్లు తేలితే ఐటీ శాఖ మీకు నోటీసులు జారీ చేయడంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే ఆధారాలతో ఐటీ శాఖకు వివరణ ఇవ్వాల్సి రావచ్చు. నేరపూరితంగా సొమ్ము అందినట్లు రుజువైతే జైలుశిక్ష కూడా పడవచ్చు. ఏయే లావాదేవీలకు ఎలాంటి పరిమితులు ఉన్నాయి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ లిమిట్ దాటితే ఇబ్బందులే..

-సేవింగ్స్ అకౌంట్ నుంచి ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు పంపినా లేదా అందుకున్నా బ్యాంకుల ద్వారా మీ లావాదేవీల హిస్టరీ నేరుగా ఐటీ శాఖకు వెళుతుంది. ఐటీ శాఖ మీ ఆదాయాన్ని పరిశీలిస్తోంది. మీ ఆదాయం కంటే ఎక్కువ నగదు అందినట్లు లేదా పంపినట్లు తేలితే చర్యలు తీసుకుంటుంది

-కరెంట్ అకౌంట్ విషయానికొస్తే.. ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ లేదా విత్ డ్రా చేసినా ఐటీ శాఖ దృష్టికి వెళుతుంది.

-ఒక ఏడాదిలో రూ.లక్ష కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లు క్యాష్ రూపంలో చెల్లించినట్లయితే ఐటీ నిఘాలోకి వెళతారు. ఇక రూ.10 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు ఆన్‌లైన్ ద్వారా చెల్లించినా ఐటీ రాడార్‌లోకి వెళతారు.

-ఒక ఏడాదిలో రూ.10 లక్షల కంటే ఎక్కువగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినా ఐటీశాఖ కనుసన్నల్లోకి వెళ్లే అవకాశముంది.

-ఇక స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వ బాండ్లలో రూ.10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడినా పెట్టినా ఐటీ శాఖ దృష్టిలోకి వెళతారు

-సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఇతర ఖాతాల వచ్చే వడ్డీలను ఐటీ రిటర్న్స్‌లో చూపించపోయినా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు

-ఏదైనా ఆస్తి, స్థలం కొనుగోలు చేసినప్పుడు రూ.30 లక్షలకు మించి ట్రాన్సక్షన్ చేస్తే ఐటీ నిఘాలోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

-చాలాకాలం పాటు ఉపయోగించని బ్యాంక్ అకౌంట్లో ఒకేసారి పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినా ఐటీ శాఖ దృష్టికి వెళుతుంది

-విదేశీ ప్రయాణాలు, విదేశీ కరెన్సీ కొనుగోలు కోసం రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినా ఐటీ నిఘాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.

Follow Us