July 10, 2026
Subhash
ఈపీఎఫ్‌వో (EPFO) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.25% వార్షిక వడ్డీని ఖాతాదారుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో వడ్డీ క్రెడిట్ అయింది.
దశలవారీగా వడ్డీ జమ కానుంది. సుమారు 8 కోట్ల మంది EPF సభ్యులకు వడ్డీ జమ చేయనున్నారు. అందరికీ ఒకేసారి కాకుండా దశలవారీగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని EPFO వెల్లడించింది.
మీ ఖాతాలో ఇంకా వడ్డీ జమ కాకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల్లో దశలవారీగా వడ్డీ జమ అవుతుంది. తుది బ్యాలెన్స్‌లో ఎలాంటి నష్టం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
EPFO వెబ్‌సైట్‌లో ఇలా చూడండి. UAN నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. ఆ తర్వాత Member Passbook పోర్టల్‌లోకి వెళ్లండి. తర్వాత వడ్డీ జమ, మొత్తం బ్యాలెన్స్ వివరాలు చూసుకోవచ్చు.
మీ ఫోన్‌లో UMANG యాప్ ఓపెన్ చేయండి. తర్వాత EPFO సర్వీసు ఆప్షన్‌లోకి వెళ్లండి. ఆ తర్వాత Passbook ఎంపిక చేసి UANతో లాగిన్ అవ్వండి. తాజా బ్యాలెన్స్, వడ్డీ వివరాలు వెంటనే కనిపిస్తాయి.
9966044425 నంబర్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వండి. లేదా 7738299899 నంబర్‌కు EPFOHO UAN అని SMS పంపండి. బ్యాలెన్స్ వివరాలు SMS రూపంలో అందుతాయి.
UAN యాక్టివ్‌గా ఉండాలి. అలాగే UANకు ఆధార్, PAN, బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండాలి. EPFO కొత్త పోర్టల్ కూడా అందుబాటులో ఉంది. వడ్డీ జమ ఆలస్యమైనా చివరి మొత్తంలో ఎలాంటి తేడా ఉండదు.
భారతీయ వంటకాల్లో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచికోసమే కాదు, ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన ఔషధం. మార్కెట్లో దొరికే పసుపు పొడిలో రసాయనాలు, రంగులు కల్తీ అవుతున్నాయి.