భారత్‌లో టాప్ 10 అత్యంత ధనవంతులు వీళ్లే..

Venkatrao Lella

Images: Pinterest

11 July 2026

దేశంలో అత్యంత ధనవంతుల్లో ముఖేష్ అంబానీ తొలి స్థానంలో ఉన్నారు. ఇక ప్రపంచ ర్యాంక్‌లో 18వ స్థానంలో నిలిచారు. ఆయన నికర ఆస్తి: $92.5 బిలియన్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఆయనకు ఆదాయం వస్తుంది.

ఇక రెండో స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. ఇక ప్రపంచ ర్యాంక్‌లో ఆయనది 28వ స్థానం. నికర ఆస్తి: $56.3 బిలియన్లు. అదానీ పేరుతో ఆయనకు వివిధ కంపెనీలు ఉన్నాయి. 

మూడో స్థానంలో సావిత్రి జిందాల్ కుటుంబం ఉంది. ఇక ప్రపంచ ర్యాంక్‌లో ఈ కుటుంబం 48వ స్థానంలో ఉంది. నికర ఆస్తి: $35.5 బిలియన్లు. స్టీల్ వ్యాపారం నుంచి ఆదాయం లభిస్తుంది.

భారత్‌లో అత్యంత ధనవంతుల్లో శివ్ నాడార్  నాలుగో ర్యాంక్‌లో ఉన్నారు. ప్రపంచ ర్యాంక్‌లో 51వ స్థానంలో నిలిచాచరు. నికర ఆస్తి: $34.5 బిలియన్లు. సాఫ్ట్‌వేర్ సేవలు ద్వారా ఆదాయం వస్తుంది

దిలీప్ షాంఘ్వి భారత్‌లో ఐదో స్థానంలో ఉన్నాయి. ప్రపంచ ర్యాంక్‌లో 79వ స్థానంలో నిలిచారు. ఆయన నికర ఆస్తి 24.9 బిలియన్లుగా ఉంది. ఫార్మాస్యూటికల్స్ రంగం నుంచి ఆదాయం వస్తుంది.

సైరస్ పూనావాలా ఆరో స్థానంలో ఉన్నారు. ప్రపంచ ర్యాంక్‌లో 86వ స్థానంలో కొనసాగుతున్నారు. నికర ఆస్తి: $23.1 బిలియన్లు. వ్యాక్సిన్ల తయారీ నుంచి ఆదాయం లభిస్తుంది.

ఏడో స్థానంలో కుమార్ బిర్లా ఉన్నారు. ప్రపంచ ర్యాంక్‌లో 97వ స్థానంలో కొనసాగుతున్నారు. నికర ఆస్తి $20.9 బిలియన్లగా ఉంది.

దేశంలో అత్యంత ధనవంతుల్లో లక్ష్మీ మిట్టల్ 8వ స్థానంలో ఉన్నారు. ప్రపంచ ర్యాంకులో 103వ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన నికర ఆస్తి $19.2 బిలియన్ డాలర్లుగా ఉంది.

రాధాకిషన్ దమాని 9వ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రపంచ ర్యాంకులో 138వ స్థానంలో ఉన్నారు. నికర ఆస్తి: $15.4 బిలియన్లు. రిటైల్, పెట్టుబడుల నుంచి ఆదాయం వస్తుంది.

కుశాల్ పాల్ సింగ్ 10వ స్థానంలో ఉన్నారు. ఆయన నికర ఆస్తి $14.5 బిలియన్లుగా ఉంది. రియల్ ఎస్టేట్ నుంచి ఆయనకు ఆదాయం లభిస్తుంది.