AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అంత గుడ్డిగా ఎలా నమ్మావ్ భయ్యా.. ఈ కేటుగాళ్లు వేసిన ప్లాన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

డబ్బు సంపాదించడానికి చెమటోడ్చాల్సిన అవసరం లేదనుకున్నారు.. ఒక్క డీల్‌తో లక్షలు వచ్చేస్తాయని కలలు కన్నారు. అసలు నోటుకు నకిలీ జతచేసి మార్కెట్‌లో కొత్త మోసానికి తెరలేపారు. అలా అని నకిలీ కరెన్సీ ఏమి ముద్రించలేదు. కానీ డబ్బు రెట్టింపు పేరుతో అమాయకులను బురిడీ కొట్టించారు.ఆసలు ఈ నకిలీ నోట్లతో ఈ ముఠా జనాలను ఎలా బురిడీ కొట్టించిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: అంత గుడ్డిగా ఎలా నమ్మావ్ భయ్యా.. ఈ కేటుగాళ్లు వేసిన ప్లాన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Fake Currency Scam
M Revan Reddy
| Edited By: |

Updated on: Jul 16, 2026 | 11:00 AM

Share

కష్టపడకుండా డబ్బులు సంపాదిదామని ప్లాన్ వేసిన ఓ ముఠాకు ఊహించని పరిణామం ఎదురైంది. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన ముదురుకోల ఏకాంబరం, ముదురుకోల దేవేందర్, హయతనగర్ కుంట్లూరుకు చెందిన మద్దిబోయిన నాగరాజు ముఠాగా ఏర్పడి ఈజీ మనీ కోసం ప్లాన్ వేశారు. నకిలీ కరెన్సీతో లక్షలు సంపాదిద్దామనుకుని స్కెచ్ వేశారు. ఇందు కోసం చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో చిన్న పిల్లలు ఆడుకునే కరెన్సీ నోట్లను కొనుగోలు చేశారు. తుర్కపల్లికి చెందిన ఓ వ్యక్తిని సంప్రదించి లక్ష రూపాయలు ఇస్తే రూ.2లక్షలు ఇస్తామని ముఠా ఆశ చూపారు. వారిని నమ్మిన సదరు వ్యక్తి మండలంలోని పల్లెపహాడ్ బస్జీ సమీపంలో వారికి లక్ష రూపాయల నగదును అప్పగించాడు.

ఇక ముఠా ఇచ్చిన బ్యాగుల్లో కట్టల కొద్దీ రూ.500 నోట్లు తీసుకున్న.. సదురు వ్యక్తి వాటిని మార్కెట్లో చలామణి చేసేందుకు రెడీ అయ్యాడు. వాటిని తీసుకొని ఇంటికెళ్లాడు. అక్కడికెళ్లాక బ్యాగుల్లోని కరెన్సీ నోట్లను చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. పైన కింద మాత్రమే అసలైన రూ.500 నోట్లు ఉంచి మధ్యలో చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెసిమేన్ అని ఇంగ్లీష్ లో ముద్రించిన పిల్లల ఆట కరెన్సీ నోట్లు ఉన్నట్టు గుర్తించాడు. ఇక మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠాకు వల పన్ని చెక్ పెట్టారు.

అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు 16 కట్టల రూ.500 ల పిల్లల ఆట కరెన్సీ నోట్లు , రూ.10వేల నగదు, మొబైల్ ఫోన్లు, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని తుర్కపల్లి పోలీసులు తెలిపారు. గతంలో ముదురుకోల ఏకాంబరం పలు నకిలీ కరెన్సీ కేసుల్లో నిందితుడని పోలీసులు తెలిపారు. కరెన్సీ నోట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ పోలీసులు సూచించారు.

మరిన్ని తెలంగాణ  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..