AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: బేబీ మెడ చుట్టూ పేగు.. భయమేసింది.. హనుమాన్ చాలీసా చదివాం.. సమంత డెలివరీ టైంలో ఇలా జరిగిందా?

సమంత డెలివరీ కావడంతో ఈమె నార్మల్ డెలివరీ అయ్యారా లేదంటే సిజేరియన్ అయ్యారా అని ఎంతో మంది ఎన్నో రకాల సందేహాలను వ్యక్తం చేశారు. తాజాగా సమంత డెలివరీ గురించి రాజ్ నిడిమోరు చిన్నమ్మ, సింగర్ డాక్టర్ శోభా రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Samantha: బేబీ మెడ చుట్టూ పేగు.. భయమేసింది.. హనుమాన్ చాలీసా చదివాం.. సమంత డెలివరీ టైంలో ఇలా జరిగిందా?
Samantha
Basha Shek
|

Updated on: Nov 26, 2026 | 7:58 AM

Share

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును ప్రేమించి పెళ్లి చేసుకున్న సామ్ నవంబర్ 19వ తేదీన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ చిన్నారికి దేవ్ నిడిమోరు అని నామకరణం చేశారు. తమ ప్రేమ బంధానికి ప్రతీకగా బిడ్డ పుట్టడంతో సమంత- రాజ్ లు ఆనందంలో మునిగితేలుతున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా తమ కుటుంబంలో కొత్త వెలుగు వచ్చిందని తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత డెలివరీ అయ్యాక ఈమె నార్మల్ డెలివరీ అయ్యారా లేదంటే సిజేరియన్ అయ్యారా అని ఎంతో మంది ఎన్నో రకాల సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై రాజ్ నిడిమోరు పిన్ని, ప్రముఖ సింగర్ శోభారాజు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె సమంత డెలివరీ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ‘సమంతకు నవంబర్ 19వ తేదీ డెలివరీ అని చెప్పగానే బాబు పరిస్థితి తెలిసి మేం చాలా భయపడ్డాం. డెలివరీకి ముందు స్కాన్ చేయగా బేబీ మెడ చుట్టూ పేగు వేసుకొని ఉండటం వల్ల కదలికలకు ఇబ్బంది అవుతుందని డాక్టర్లు చెప్పారు. బాబు పరిస్థితి ఇలా ఉందని తెలియగానే మేమంతా దేవుడిని ప్రార్థించాము. కాసేపటికి బాబు కదలికలు బాగున్నాయని డాక్టర్లు తెలియజేశారు. ఇక మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో రాజ్ ఫోన్ చేసి సమంతకు సిజేరియన్ చేయాలని డాక్టర్లు చెప్పినట్టు తెలిపారు. ఆ సమయంలో ఇదేంటి భగవంతుడా అనుకొని అందరం హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టాం’

ఇక సమంత నార్మల్ డెలివరీ అయిందని, బాబు పుట్టాడని రాజ్ నుంచి ఫోన్ రాగానే చాలా సంతోషపడ్డాం. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ చాలా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇదంతా కూడా ఆ భగవంతుడి మహిమ’ అని శోభారాజు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సింగర్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. సమంత డెలివరీ సమయంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొందా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే సమంతకు బాబు పుట్టిన తర్వాత రాజ్ నిడిమోరు సోదరి శీతల్ చేసిన పనులు అందరి మన్ననలు అందుకుంటున్నాయి. చిన్నారి ఆరోగ్యం, ఆయుష్షు, భవిష్యత్తు బాగుండాలని శీతల్ మూడు మతాలకు చెందిన పవిత్ర స్థలాలకు వెళ్లి ప్రార్థనలు చేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ప్రార్థనా మందిరాలకు వెళ్లి బాబు కోసం ఆశీర్వాదం తీసుకుంది. శీతల్, తన పిన్నితో కలిసి ముంబైలోని ఫేమస్ సిద్ధివినాయక టెంపుల్, హాజీ అలీ దర్గా, సెయింట్ మైఖేల్ చర్చికి వెళ్లారు. విశేషం ఏంటంటే, ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూనే ఈ మూడు చోట్లకు వెళ్లి బుజ్జి దేవ్ కోసంప్రార్థనలు చేశారు శీతల్. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us