AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder Delivery: కేవలం 10 నిమిషాల్లో ఇంటికే గ్యాస్ సిలిండర్ డెలివరీ.. గ్యాస్ కనెక్షన్ కూడా అక్కర్లేదు..

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు అలర్ట్. ఇక నుంచి సిలిండర్ కోసం రోజుల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం 10 నిమిషాల్లోనే మీ ఇంటికి నేరుగా సిలిండర్ వచ్చేస్తుంది. అవును క్విక్ కామర్స్ ద్వారా మీరు పొందవచ్చు. త్వరలోనే ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

Gas Cylinder Delivery: కేవలం 10 నిమిషాల్లో ఇంటికే గ్యాస్ సిలిండర్ డెలివరీ.. గ్యాస్ కనెక్షన్ కూడా అక్కర్లేదు..
Gas Cylinder
Venkatrao Lella
|

Updated on: Jul 16, 2026 | 10:59 AM

Share

ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఇంటికి రావాలంటే మూడు, నాలుగు రోజుల టైమ్ పడుతుంది. కాస్త ఆలస్యమైతే వారం రోజుల సమయం కూడా పట్టవచ్చు. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య యుద్ద సమయంలో గ్యాస్ సరఫరాకు అంతరాయం కలగడంతో సిలిండర్ల డెలివరీలో జాప్యం జరిగింది. 10 రోజుల సమయం పట్టిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఇటీవల యుద్దానికి బ్రేక్ పడగా.. ఇప్పుడు మళ్లీ అమెరికా-ఇరాన్ మధ్య వార్ స్టార్ట్ అయింది. దీంతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ముడి చమురు, గ్యాస్ రవాణాకు అంతరాయం కలిగే పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. ఇదే జరిగితే మళ్లీ గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. దీంతో గ్యాస్ డెలివరీ కష్టాలు మళ్లీ మొదలయ్యే ఛాన్స్ ఉంది.

10 నిమిషాల్లోనే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్

ప్రస్తుతం బుక్ చేసుకున్న మూడు రోజులకు గ్యాస్ సిలిండర్ ఇంటికి డెలివరీ అవుతుంది. అయితే 10 నిమిషాల్లోనే సిలిండర్ మీ ఇంటికి వస్తే.. అది అద్బుతం కదా.. అవును త్వరలో 10 నిమిషాల్లోనే గ్యాస్ సిలిండర్ మీరు పొందవచ్చు. ఈ మేరకు హెచ్‌పీసీఎల్ కంపెనీతో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ జత కట్టింది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా సిలిండర్ డెలివరీ చేసేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో ఇక నుంచి క్విక్ కామర్స్ విధానం ద్వారా సిలిండర్లను కూడా డెలివరీ చేయనుంది. ఆన్ డిమాండ్ ఎల్పీజీ సిలిండర్ డెలివరీ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా గ్యాస్ అయిపోగానే వంట చేసేందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. బుక్ చేయగానే 10 నిమిషాల్లో కూరగాయలు, సరుకులు ఇంటికి వచ్చినట్లుగానే సిలిండర్ కూడా వచ్చేస్తుంది.

గ్యాస్ కనెక్షన్ అవసరం లేదు..

ఒప్పందంలో భాగంగా 5 కిలోల ఎఫ్‌టీఎఫ్ సిలిండర్లను డెలివరీ చేయనున్నారు. అలాగే రెగ్యులర్ కనెక్షన్ రీఫిల్‌ను కూడా డెలివరీ చేసేందుకు భాగస్వామ్యం కుదిరింది. ఇక 10కేజీల కాంపొజిట్ ఎల్‌పీజీ సిలిండర్లను కూడా డోర్ డెలివరీ చేయనున్నారు. కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులకు ఈ సర్వీసులు అందిస్తారు. చిన్న వ్యాపారులు, బ్యాచిలర్స్, గృహిణులకు వీటి ద్వారా ఊరట లభించనుంది. ప్రస్తుతం స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ బెంగళూరులో ఈ సేవలు ప్రారంభించింది. 5 కేజీల మెటల్, 10 కేజీల సిలిండర్లను డెలివరీ చేస్తోంది. రానున్న రోజుల్లో అన్ని నగరాల్లో ప్రవేశపెట్టనుంది. అయితే ఎలాంటి గ్యాస్ కనెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. తొలుత గ్యాస్ బుక్ చేసుకున్న సమయంలో డెలివరీ డాక్యుమెంటేషన్, గుర్తింపు వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం రీఫిల్లింగ్‌కు ఎలాంటి డాక్యుమెంటేషన్ ఉండదు. పాత సిలిండర్ ఇచ్చి కొత్త సిలిండర్ తీసుకోవచ్చు.

Follow Us