రాకెట్ స్పీడ్.. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన 10 రైళ్లు ఇవే..

Venkatrao Lella

Images: Pinterest

02  OCT 2026

ప్రపంచవ్యాప్తంగా బుల్లెట్ రైళ్లు వచ్చేస్తున్నాయి. వీటి ద్వారా గంటలోనే ఒక నగరం నుంచి మరో నగరానికి చేరుకోవచ్చు. ప్రపంచంలో అత్యంత స్పీడ్‌తో వెళ్లే 10 రైళ్లు ఏంటనేది చూద్దాం.

చైనాలోని షాంఘై మ్యాగ్లెవ్ ట్రైన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు జాబితాలో తొలి స్థానంలో ఉంది. దీని వేగం గంటకు 460 కిలోమీర్లు. ఈ రైలు మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది.

రెండో స్థానంలో చైనాకు చెందిన CR450 ఫుక్సింగ్ రైలు ఉంది. ఇది గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలు శక్తి వినియోగాన్ని 10 శాతం తగ్గిస్తుంది.

చైనాకు చెందిన CR400 ఫుక్సింగ్ హావ్ రైలు వరల్డ్ హైస్పీడ్ రైళ్ల లిస్టులో మూడో స్థానంలో ఉంది. దీని వేగం గంటకు 350 కిలోమీటర్లుగా ఉంది. బీజింగ్-గ్వాంగ్‌జౌ మధ్య ఇది ప్రయాణిస్తుంది.

చైనాలోని CRH380A హెక్సీ ట్రైన్ అత్యంత వేగవంతమైన రైళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ట్రయల్ రన్స్‌లో ఇది 486.1 కి.మీ వేగాన్ని అందుకోగా.. ఇది గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం ప్రయాణిస్తుంది.

స్పెయిన్‌కు చెందిన తాల్గో 350 / అవ్రిల్ రైలు ఐదో స్థానంలో ఉంది. ఇది గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మలుపుల్లో కూడా స్థిరంగా వెళ్లేలా ఈ హైస్పీడ్ ట్రైన్ అభివృద్ది చేశారు.

జర్మనీకి చెందిన ICE 3 / సీమెన్స్ మల్టీపుల్ యూనిట్ హైస్పీడ్ రైళ్ల జాబితాలో ఆరో స్థానంలో ఉంది. ఇది గంటకు 330 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది.

ఇక జపాన్‌కు చెందిన జేఆర్ ఈస్ట్ E5 / H5 సిరీస్ షింకన్సేన్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ఏడో స్థానంలో ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన TGV M / POS ఏడో స్థానంలో ఉంది. ఇది గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

యూరోస్టార్ e320 ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైళ్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇది లండన్ నుండి పారిస్, బ్రస్సెల్స్ మధ్య ప్రయానిస్తుంది. గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

దక్షిణ కొరియాకు చెందిన KTX-చియోంగ్యాంగ్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ పదో స్థానంలో నిలిచింది. ఇది అల్యూమినియం బాడీతో రూపుదిద్దుకుంది.