రైలులో ఇచ్చే ఆహారం రుచిగా ఎందుకు అనిపించదు? అసలు కారణాలు ఇవే

July 11, 2026

Subhash

రైలు ప్రయాణంలో వచ్చే నిరంతర ఖడఖడ శబ్దాలు మన మెదడును ప్రభావితం చేస్తాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, ఎక్కువ శబ్దం ఉన్న వాతావరణంలో తీపి, ఉప్పు రుచులను గుర్తించే సామర్థ్యం 15% వరకు తగ్గుతుంది.

శబ్దం

రుచిని ఆస్వాదించడంలో 80% పాత్ర మన ముక్కుదే ఉంటుంది. ఏసీ కోచ్‌లలో గాలి చాలా పొడిగా ఉంటుంది. ఈ తక్కువ తేమ వల్ల మన ముక్కులోని శ్లేష్మ పొరలు ఎండిపోయి. ఆహారం సువాసనను సరిగ్గా ఆస్వాదించలేము.

AC కోచ్‌

రైల్వే బేస్ కిచెన్లలో ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికుల కోసం ఒకేసారి భారీ పరిమాణంలో ఆహారాన్ని తయారు చేస్తారు. ఇలా ఇంట్లో వండినట్లుగా ప్రతి వంటకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడం రుచి రాదు.

భారీ మొత్తంలో

ఆహారాన్ని చాలా గంటల ముందే బేస్ కిచెన్లలో వండేస్తారు. మీకు ఇచ్చే ముందు దానిని కేవలం రీ-హీట్ చేస్తారు. ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల అందులోని సహజ తేమ, అసలైన ఫ్లేవర్ ఆవిరైపోతాయి.

వేడి చేయడం

ఎత్తైన ప్రదేశాలలో, వేగంగా కదిలే వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు వాతావరణ పీడనంలో స్వల్ప మార్పులు వస్తాయి.నేరుగా మన శరీరంలోని జీవక్రియలను, రుచి గ్రంథుల సున్నితత్వాన్ని కొంత మేరకు తగ్గిస్తుంది.

ఎత్తైన

ఆహారం చప్పగా ఉండకూడదనే ఉద్దేశంతో కొన్నిసార్లు కిచెన్లలో ఎక్కువ మొత్తంలో ఉప్పు, నూనె లేదా మసాలాలు వాడుతుంటారు. 

ఎక్కు ఉప్పు, మసాలాలు

అలాగే ఎక్కువ సమయం ప్యాకింగ్‌లో ఉండటం వల్ల ఆ రసాయనాలు, మసాలాలు విచిత్రమైన లేదా కృత్రిమమైన రుచిని ఇస్తాయి తప్ప సహజ రుచిని ఇవ్వవంటున్నారు నిపుణులు.

ప్యాకింగ్‌

రైలు ప్రయాణంలో ఆహారం బాగా రుచించాలంటే.. పండ్ల ముక్కలు, నిమ్మరసం పిండిన వంటకాలు, లేదా కాస్త ఘాటైన చట్నీలు/ఊరగాయలు వంటివి వెంట తెచ్చుకోవడం మంచిది.

ప్రయాణికులకు చిట్కా