AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పరుగులు.. ఈ రూట్లోనే సర్వీసులు.. ఫీచర్లు మాములుగా లేవు..

దేశంలో తొలి హైడ్రేజన్ రైలు రేపటి నుంచి పట్టాలెక్కనుంది. ప్రయాణికులకు సర్వీసులు అందించేందుకు సిద్దమైంది. ఇప్పటికే ఈ ట్రైన్ రూట్, టైమింగ్స్ ఖరారు అయ్యాయి. ఇటీవలే ఈ ట్రైన్‌కు రైల్వే బోర్డు ఆమోదం తెలపగా.. జులై 17వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు.

Venkatrao Lella
|

Updated on: Jul 16, 2026 | 1:30 PM

Share
భారతీయ రైల్వేలో మరో నూతన శకం మొదలుకానుంది. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కేందుకు సర్వం సిద్దమైంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ జులై 17వ తేదీన ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం కోసం దేశ ప్రజలందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు

1 / 5
రైల్వేశాఖ ఇప్పటికే ట్రైన్ రూట్, టైమ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇప్పటికే హైడ్రోజన్ రైళ్లు కొన్ని దేశాల్లో మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ దేశాల సరసర భారత్ కూడా చేరనుంది. కొన్ని దేశాల్లో నడుస్తున్న హైడ్రోజన్ రైళ్లకు మూడు కోచ్‌లు ఉండగా.. మరికొన్నింటికి అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా 10 కోచ్‌లతో భారత్‌లో  హైడ్రోజన్ రైలు పరుగులు తీయనుంది. భవిష్యత్తులో ఇలాంటి రైళ్లను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ప్రవేశపెట్టనున్నారు.

2 / 5
రానున్న రెండు, మూడేళ్లల్లో దేశంలో ఇలాంటి మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ రైళ్లు పర్యావరణానికి ఎలాంటి హాని చేయవు. ఎందుకంటే ఇవి డీజిల్‌కు బదులుగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తాయి. పొగకు బదులుగా కేవలం నీటి ఆవిరి మాత్రమే వీటి నుంచి వస్తుంది. ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. కానీ ప్రయాణీకుల భద్రత దృష్ట్యా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు.

3 / 5
ఈ ట్రైన్లో మొత్తం 10 కోచ్‌లు ఉండగా.. 682 సీట్లు ఉన్నాయి. ఒకేసారి 2,600 మంది ప్రయాణీకులు ఇందులో ప్రయాణం చేయవచ్చు. ఇందులో కేవలం నాన్ ఏసీ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. వీటిల్లో విలాసవంతమైన సీట్లు, మొబైల్ ఛార్జింగ్ సాకెట్లు, ప్రయాణీకుల సేఫ్టీ కోసం హైడ్రోజన్ లీక్ డిటెక్షన్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి ఈ ట్రైన్‌ను ప్రారంభించనున్నారు.

4 / 5
హర్యానాలోని జింద్- సోనిపత్ మధ్య ఈ ట్రైన్ నడుస్తుంది. 89 కిలోమీటర్ల వన్ వే దూరాన్ని  రెండు గంటల్లో పూర్తి చేస్తుంది. ప్రతిరోజూ రెండు రౌండ్ ట్రిప్పులు ఇది తిరుగుతుంది. ఈ రైలు జింద్ సిటీ, పాండు పిండార, లలిత్ ఖేడా, భంభేవా, ఇషాపూర్ ఖేరీ, బుటానా, ఖండ్రాయ్, గోహనా, రభ్రా, లాత్, మోహనా హర్యానా, బర్వాస్నితో సహా మొత్తం 12 స్టేషన్లలో ఆగుతుంది.

5 / 5
Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్

మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..

సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..

తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్

నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!

యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్

బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..

అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి

క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?

ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!