AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం బర్త్ డే స్పెషల్.. కొడుకు ఫొటోల‌ను షేర్ చేసిన భార్య‌.. ఎంత క్యూట్ గా ఉన్నాడో!

ఇవాళ (జులై 15) టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో కిరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ అతని భార్య రహస్య గోరఖ్ సోషల్ మీడియాలో కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ ను షేర్ చేసింది.

Basha Shek
|

Updated on: Jul 15, 2026 | 10:35 PM

Share
 అటు ప్రొఫెషనల్ లైఫ్ పరంగానూ, ఇటు పర్సనల్ లైఫ్ పరంగానూ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం. క, కే- ర్యాంప్ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో కిరణ్ గతేడాది తండ్రిగా ప్రమోషన్ కూడా పొందాడు.

1 / 6
ఈ ఏడాది కిరణ్ నటించిన సినిమాలు రిలీజ్ కాకపోయినా  అతను నిర్మించిన తిమ్మరాజుపల్లి టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమానే అయినా కంటెంట్ పరంగా, మేకింగ్ పరంగానూ ఈ మూవీకి ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

2 / 6
ఇక హీరోగా ప్రస్తుతం ది చెన్నై లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఇందులో తెలుగమ్మాయి శ్రీ గౌరిప్రియ హీరోయిన్ గా నటించింది. 'బేబీ' మూవీ దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాకు కథను అందించగా, రవి నంబూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

3 / 6
 ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంటున్నాడు కిరణ్. కాగా బుధవారం (జులై 15) ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు అతనికి బర్త్ డే విషెస్ చెప్పారు.

4 / 6
 ఇక కిరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని అతని భార్య, ఒకప్పటి హీరోయిన్ రహస్య గోరఖ్ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పింది. ఇదే సందర్భంగా తన ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోలిప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

5 / 6
 రహస్య షేర్ చేసిన ఫొటోల్లో ఎక్కువగా కుమారుడు హను అబ్బవరం ఫొటోలే ఎక్కువగా ఉన్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం కుమారుడు చాలా క్యూట్ గా ఉన్నాడంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

6 / 6
Follow Us