దీపావళి నాటికి బంగారం ధర ఎంత పెరుగుతుందో తెలుసా..? షాకింగ్‌ న్యూస్‌

July 15, 2026

Subhash

ఆగస్టు, సెప్టెంబర్ నెలల నుండి దేశంలో పండుగల సీజన్ కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. దీంతో మార్కెట్‌లో బంగారం కొనుగోళ్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది.

పండుగల సీజన్ డిమాండ్

రాబోయే దీపావళి పండుగ సమయానికి బంగారానికి ఉండే డిమాండ్ గత ఏడాది కంటే సమానంగా లేదా అంతకంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 దీపావళి జోష్‌..

ఒకవేళ అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి, అంతర్జాతీయ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే.. బంగారం ధర పది గ్రాములకు ఏకంగా రూ.1.60 లక్షల మార్కును తాకవచ్చు.

రూ.1.60 లక్షల మార్కు?

ఒకవేళ అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitical tensions) ఇలాగే కొనసాగితే.. బంగారం ధరలు రూ. 1.35 లక్షల నుండి రూ. 1.45 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

ఉద్రిక్తతలు కొనసాగితే..

పసిడి ప్రియుల చూపు బంగారంతో పాటు వెండి ధరలపై కూడా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఔన్స్‌కు 60 డాలర్ల సమీపంలో బలంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

వెండి ధరలు

దేశీయ మార్కెట్‌లో వెండి ధరకు కిలోకు రూ. 2.20 లక్షల సమీపంలో బలమైన సపోర్ట్ లభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల విశ్లేషణ.

వెండికి బలమైన సపోర్ట్

మార్కెట్ అంచనాల ప్రకారం, వెండి ధర త్వరలోనే కిలోకు రూ. 2.28 లక్షల మార్కును చేరేందుకు బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి.

 వెండి సరికొత్త టార్గెట్

పండుగల సీజన్‌, పెళ్లిళ్ల సీజన్ ఒకేసారి రాబోతుండటంతో.. ధరల ట్రెండ్‌ను గమనిస్తూ, మార్కెట్లలో వచ్చే చిన్నపాటి తగ్గుదలలను పెట్టుబడికి సరైన అవకాశంగా మలచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

పండుగల సీజన్‌