AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card: మీకు తెలియకుండా మీ పేరుపై లోన్ తీసుకున్నారా..? పాన్ నెంబర్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఒకే ఒక్క క్లిక్‌తో..

ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వ్యక్తుల ఆధార్, పాన్ కార్డులతో సైబర్ క్రిమినల్స్ రుణాలు పొందుతున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రతీఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. మీ పేరుపై ఎవరైనా అక్రమంగా లోన్ పొందితే గుర్తించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటి అనేది చూద్దాం.

Pan Card: మీకు తెలియకుండా మీ పేరుపై లోన్ తీసుకున్నారా..? పాన్ నెంబర్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఒకే ఒక్క క్లిక్‌తో..
Pan Card
Venkatrao Lella
|

Updated on: Jul 16, 2026 | 9:24 AM

Share

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ఏ పని అయినా ఇంటి నుంచే మొబైల్ ద్వారా చేసుకునే సౌలభ్యం లభించింది. బ్యాంకింగ్ సేవలు మరింత వేగంగా మొబైల్ నుంచే పొందవచ్చు. మీకు లోన్ కావాలంటే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే డాక్యుమెంట్స్ చెక్ చేసి లోన్ మంజూరు చేస్తారు. ప్రస్తుతం ఇన్‌స్టంట్ లోన్ ఆప్షన్ వచ్చేసింది. దరఖాస్తు చేసుకున్న గంటల్లోనే లోన్ మంజూరు చేస్తున్నారు. దీంతో మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా తక్షణ రుణం పొందే అవకాశం ఉన్నప్పటికీ.. మోసాల కేసులు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. మోసగాళ్లు వ్యక్తుల ఆధార్, పాన్ కార్డు పత్రాలను సంపాదించి రుణాలు పొందుతున్నారు. బ్యాంకు నుండి నోటీసు అందుకునే వరకు తమ పేరుపై నకిలీ లోన్ ఉందని తెలియక బాధితులు మోసపోతున్నారు. ఇలాంటి మోసాలను మీరు ముందుగానే గుర్తించవచ్చు. జస్ట్ మీ పాన్ కార్డు ద్వారా మీ పేరుపై ఉన్న ఫేక్ రుణాలను పసిగట్టవచ్చు. అదెలా అనే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం.

సిబిల్ రిపోర్ట్ చెక్ చేస్కోండి..

మీ పేరు మీద ఉన్న రుణాల గురించి సమాచారం తెలుసుకోవడానికి అత్యంత సులభమైన మార్గం సిబిల్ రిపోర్ట్ చెక్ చేయడం. సిబిల్ వెబ్‌సైట్ లేదా పేటీఎం, పైసాబజార్, క్రెడ్ యాప్‌లలో మీరు ఉచితంగా క్రెడిట్ స్కోర్‌ చెక్ చేసుకోవచ్చు. మీ పేరు, మొబైల్ నంబర్, పాన్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేస్తే.. మీ ఫోన్‌కు ఒక OTP వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే.. మీ క్రెడిట్ రిపోర్ట్ వస్తుంది. ఈ రిపోర్టులో ‘యాక్టివ్ అకౌంట్స్’ విభాగానికి వెళ్లి ఏ రుణాలు లేదా క్రెడిట్ కార్డులు జాబితాలో ఉన్నాయో జాగ్రత్తగా తనిఖీ చేయండి. మీకు తీసుకోకపోయినా.. ఏదైనా సంస్థ నుంచి రుణం తీసుకున్నట్లు కనిపిస్తే మీరు మోసానికి గురయ్యారని గ్రహించండి. అటువంటి పరిస్థితిలో కంగారు పడకండి. అనుమానాస్పద రుణ ఖాతా నంబర్, బ్యాంకు పేరును రాసుకోండి. ఆ తర్వాత, వెంటనే సంబంధిత బ్యాంకు లేదా రుణ సంస్థ కస్టమర్ కేర్ విభాగానికి ఫిర్యాదు చేయండి.

చట్టబద్దంగా ఫిర్యాదు చేయడం ఎలా..?

బ్యాంకుకు ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో FIR దాఖలు చేయవచ్చు. ఇక RBI ‘సాచెట్’ పోర్టల్‌లో లిఖితపూర్వక ఫిర్యాదును కూడా సమర్పించవచ్చు. బ్యాంకు, సైబర్ పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత మీ CIBIL స్కోరు సరిచేయబడుతుంది.

Follow Us