AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మటన్‌ అమ్మే పనిలో బిజీగా షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌.. తర్వాత ఏమైందంటే..

మటన్‌ అమ్మే పనిలో బిజీగా షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌.. తర్వాత ఏమైందంటే..

Phani CH
|

Updated on: Aug 20, 2026 | 3:49 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఓ మాంసం దుకాణంలోకి 15 అడుగుల భారీ కొండచిలువ ప్రవేశించింది. మేకను మింగేందుకు ప్రయత్నిస్తున్న పామును చూసి అందరూ భయపడగా, మద్యం మత్తులో ఉన్న సురేష్ మాత్రం దాన్ని చేతులతో పట్టుకున్నాడు. పాము రెండుసార్లు కరిచినా వెనక్కి తగ్గకుండా భుజాలపై వేసుకుని వీధుల్లో తిరిగాడు. చివరకు దాన్ని డబ్బాలో బంధించి కాలువలో వదిలేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్ బారాబంకిలో శుక్రవారం రాత్రి ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఒక మాంసం దుకాణంలోకి సుమారు 15 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ప్రవేశించింది. అక్కడ వేలాడుతున్న మేకల్లో ఒకదానిని తినేందుకు అది యత్నించింది. గమనించిన షాపు యజమాని ప్రాణభయంతో బయటకు పరుగులు తీశాడు. అదే సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన సురేష్‌ అనే వ్యక్తి బాగా మద్యం సేవించి ఉన్నాడు. మత్తులో ఉన్న అతను ఏమాత్రం భయం లేకుండా ఆ కొండచిలువను తన చేతులతో పట్టుకున్నాడు. తప్పించుకునేందుకు ఆ పాము సురేష్ చేతిని రెండుసార్లు కొరికింది. అయితే, కొండచిలువలకు విషం లేకపోవడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. మద్యం మత్తులో రెచ్చిపోయిన సురేష్, ఆ భారీ కొండచిలువను తన భుజాలపై వేసుకుని వీధుల్లో హల్ చల్ చేశాడు. దానితో నానా రకాలుగా విన్యాసాలు చేస్తూ ఆడుకున్నాడు. ఈ వింత దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల జనం భారీగా గుమిగూడారు. కొద్దిసేపటి తర్వాత ఆ కొండచిలువను ఒక పెద్ద డబ్బాలో బంధించి దగ్గర్లోని కాలువలో వదిలిపెట్టాడు. కోపంతో ఊగిపోయిన ఆ పాము తలను మూడు అడుగుల మేర పైకి లేపి, ఆ తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి పాకుతూ వెళ్లిపోయింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ తాగుబోతు సాహసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anupama Parameswaran: నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..

టాలీవుడ్‌లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్‌ చర్యలు

బఘీరా.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారా.. NTR ఎమోషనల్!

Balakrishna 111: గాయాన్ని లెక్కచేయకుండా.. బాలయ్య మొండి పట్టు

నటితో తప్పుడు పని చేస్తూ.. భార్యకు దొరికిపోయిన ఫోక్ డాన్సర్

Follow Us