బఘీరా.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారా.. NTR ఎమోషనల్!
జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రేమగా పెంచుకున్న ‘బఘీరా’ శునకం మృతి చెందడంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నాలుగేళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. బఘీరా జ్ఞాపకార్థం మొక్కను కూడా నాటారు. మరోవైపు ‘డ్రాగన్’ షూటింగ్‌లో భుజానికి గాయమైన తారక్‌కు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ విజయవంతమైంది. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన రెండు మూడు నెలల్లో పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.
నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ‘బఘీరా’ అనే శునకం మృతి చెందడంతో తారక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బఘీరాతో తమకున్న నాలుగేళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. “బఘీరా.. నా ప్రపంచంలోకి ఒక తోడుగా వచ్చావు. కానీ, నెమ్మదిగా నా కుటుంబంలో ఒకరిగా మారిపోయావు. ప్రేమ, విశ్వాసం, అల్లరి, ఓదార్పుతో నా రోజులను నింపావు. నీవు లేని లోటు మాటల్లో చెప్పలేనంత పెద్ద నిశ్శబ్దాన్ని మిగిల్చింది. కానీ, నువ్వు పంచిన ప్రేమ అలాగే నిలిచి ఉంటుంది. నన్ను నీ తోడుగా ఎంచుకున్నందుకు, నా పక్కన నడిచినందుకు, ఈ నాలుగేళ్లను మరింత అందంగా మార్చినందుకు ధన్యవాదాలు. స్వేచ్ఛగా పరిగెత్తు నా చిన్నారి. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం” అని ఎన్టీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. బఘీరాతో దిగిన ఫొటోలతో పాటు, దాని జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటిన చిత్రాన్ని ఆయన పంచుకున్నారు. మరోవైపు, ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆసుపత్రి వర్గాలు స్పష్టతనిచ్చాయి. ఇటీవల ‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌లో భుజానికి గాయమవడంతో, సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ విజయవంతంగా జరిగింది. ఆగస్టు 13న డిశ్చార్జ్ అయిన తారక్, ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో రెండు మూడు నెలల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balakrishna 111: గాయాన్ని లెక్కచేయకుండా.. బాలయ్య మొండి పట్టు
నటితో తప్పుడు పని చేస్తూ.. భార్యకు దొరికిపోయిన ఫోక్ డాన్సర్
తమ్ముడూ.. ఒక్కసారి పలకరించరా’ బ్రహ్మానందం సోదరుడి ఆవేదన.. హాట్ టాపిక్ అన్నదమ్ముల వ్యవహారం
Pallavi Prashanth: డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి ‘బిగ్ బాస్’ లాగేసుకుంటే..నేనెట్టా పంచేది!
ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్!
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత
ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్ చూసి గుండె గుభేల్
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్

