ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈసారి సెలబ్రిటీలతో పాటు కామనర్స్‌కు కూడా అవకాశం కల్పిస్తున్నారు. అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా పలువురు పోటీ పడుతున్నారు. మొత్తం 20 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉందని ఆది రెడ్డి చెబుతున్నారు. పల్లవి గౌడ, నూకరాజు, రాకింగ్ రాకేష్, హరి, రాయల్ ఎంసీ రమణ తదితర పేర్లు ప్రస్తుతం బాగా ప్రచారంలో ఉన్నాయి. నాగార్జునే హోస్ట్‌గా కొనసాగనున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈసారి కూడా సెలబ్రిటీలకు కామన్ పీపుల్‌కు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష’ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అగ్నిపరీక్ష సీజన్ 2కు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. రాజకుమారి డయానా, షాలిని పటేల్, ఆర్జే చరణ్, మిథిలేష్, శ్రష్ఠి వ్యాకర్ని, అమన్, హేమంత్, నవరసాలు ఆర్కే, భాగీ తుళ్లూరి, దీపక్, రోహిత్, యాంకర్ ప్రియా, సింగర్ ఝాన్సీ, గాయత్రి, మిస్ అపూర్వ.. ఇలా చాలా మంది అగ్ని పరీక్ష సీజన్ 2 లో అదృష్టం పరీక్షించుకున్నారు. మరి వీరిలో ఎవరెవరు హౌస్ లోకి వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రియాలిటీ షో గురించి అలాగే అగ్ని పరీక్ష సీజన్ 2 పైనా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాడు ఆది రెడ్డి. ఈసారి మొత్తం 10 మంది సెలబ్రిటీలు, 10 మంది కామనర్స్ హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉందంటున్నాడు ఆది రెడ్డి. ఇక బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్లపైనా వరుసగా హింట్స్ ఇస్తున్నాడు ఆది రెడ్డి. పల్లవి గౌడ ఈసారి హౌస్ లోకి కచ్చితంగా అవకాశం ఉందని ఆది రెడ్డి అంచనా వేశాడు. అలాగే జబర్దస్త్ ఫేమ్ హరి, రాకింగ్ రాకేష్, నూకరాజుల్లో కచ్చితంగా ఒకరు బిగ్ బాస్ 10లోకి వచ్చే అవకాశం ఉందంటున్నాడీ మాజీ కంటెస్టెంట్. వీరిలో నూకరాజుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని, ఇతనిని చూస్తుంటే ఇమ్మాన్యుయేల్ గుర్తుకు వస్తున్నాడని ఆది రెడ్డి అంటున్నాడు. అలాగే మరో జబర్దస్త్ నటుడు, స్క్రిప్ట్ రైటర్ హరి కూడా హౌస్ లోకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నాడు ఆది రెడ్డి. అలాగే రాయల్ ఎంసీ రమణ కూడా కంటెస్టెంట్స్ గా వచ్చే అవకాశం ఉందంటున్నాడీ మాజీ కంటెస్టెంట్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈసారి కూడా నాగార్జనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. పేరున్న సీరియల్ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, జబర్దస్త్ కమెడియన్లు ఈసారి హౌస్ లోకి రానున్నారని తెలుస్తోంది. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, రాకింగ్ రాకేష్, వర్ష, పవిత్ర, వర్షిణి, నందూస్ వరల్డ్ నందు, చంద్రహాస్, జ్యోతి, రాయల్ ఎంసీ రమణ, హీరో అబ్బాస్ వంటి పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. ఆకాశంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం..
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత
ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..
ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి వెళ్లిన మహిళ.. అక్కడ సీన్ చూసి గుండె గుభేల్
కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి.. ఎందుకో తెలిస్తే వెన్నులో వణుకే!
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్!
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత
ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్ చూసి గుండె గుభేల్
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్

