ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. ఆకాశంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం..
అమెరికాలోని ఫీనిక్స్ స్కైహార్బర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో రెండు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాలు గాల్లో ఎదురెదురుగా రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు విమానాలకు ఒకే నంబర్ ఉండటంతో గందరగోళం తలెత్తింది. అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వెంటనే పైలట్లను హెచ్చరించి, ఒక విమానాన్ని పైకి, మరొకదాన్ని కిందికి మళ్లించారు. దీంతో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
గగనతలంలో రెండు విమానాలకు పెను ప్రమాదం తప్పింది. యూఎస్‌ఏలోని ఆరిజోనా రాష్ట్రం ఫీనిక్స్ స్కైహార్బర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలు గాల్లో ఎదురెదురుగా వచ్చి భయాందోళన సృష్టించాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ రెండు విమానాలకు ఒకే నంబర్ ఉండటంతో ఈ గందరగోళం తలెత్తింది. షికాగో నుంచి రావాల్సిన బోయింగ్ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ఆలస్యం కావడంతో.. అదే సమయంలో ఫీనిక్స్ నుంచి బయలుదేరిన మరో విమానం రెండూ ఒకే మార్గంలోకి వచ్చాయి. వేర్వేరు మార్గాల్లో వెళ్లే విమానాలకు ఒకే నంబర్ వాడటం సాధారణమే అయినా, ఒకే కాల్ సైన్ ఉన్న విమానాలు ఒకే గగనతలంలోకి రావడం షెడ్యూలింగ్ పొరపాటును బయటపెట్టింది. అలర్టయిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఈ అసాధారణ పరిస్థితిని గుర్తించారు. వెంటనే స్పందించి రెండు విమానాల పైలట్లకు వేర్వేరు సూచనలు జారీ చేశారు. అరైవల్ విమానాన్ని ఎక్కువ ఎత్తుకు, డిపార్చర్ విమానాన్ని తక్కువ ఎత్తులో ప్రయాణించాలని అప్రమత్తం చేశారు. కంట్రోలర్ సూచనలతో పైలట్లు మార్గాన్ని మార్చుకోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 25 ఏళ్ల సర్వీస్‌లో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని సదరు కంట్రోలర్ తెలిపారు. ఈ భద్రతాలోపంపై ప్రస్తుతం ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత
ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..
ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి వెళ్లిన మహిళ.. అక్కడ సీన్ చూసి గుండె గుభేల్
కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి.. ఎందుకో తెలిస్తే వెన్నులో వణుకే!
దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత
ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్ చూసి గుండె గుభేల్
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
రెనోవేషన్ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం
మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్ జీపీటీని అడగండి
రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్

